లైగర్ ఫ్లాప్.. ఖుషితో హిట్ కొట్టబోతున్నాం-విజ‌య్ దేవ‌ర‌కొండ‌

August 31, 2023

లైగర్ ఫ్లాప్.. ఖుషితో హిట్ కొట్టబోతున్నాం-విజ‌య్ దేవ‌ర‌కొండ‌

`ఖుషి సినిమాలో నటించడాన్ని ఎంజాయ్ చేశాం. ఈ సినిమాకు సమంత, శివ నిర్వాణ వంటి మంచి టీమ్ దొరికింది. వీళ్లంతా ఎవరి పని వాళ్లు కరెక్ట్ గా చేస్తారు. ఈ సినిమా ఫస్టాఫ్ లో నేను లవర్ బాయ్ లా కనిపిస్తా. ఆ తర్వాత మ్యారీడ్ బాయ్ గా కనిపిస్తా. నేను ఇప్పటిదాకా హజ్బెండ్ క్యారెక్టర్ చేయలేదు. ఫుల్ ఫన్ అండ్ డ్రామాతో సాగే సినిమా ఖుషి` అని అన్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఖుషి ప్రచారంలో భాగంగా నేషనల్ వైడ్ అభిమానులతో క్యూ అండ్ ఏ నిర్వహించారు విజయ్. ఈ ఇంటరాక్షన్ లో ఖుషి హైలైట్స్ తో పాటు పర్సనల్ లైఫ్ లో తన అభిప్రాయాలు హీరోయిన్ సమంత, డైరెక్టర్ శివ నిర్వాణ గురించి మాట్లాడారు.

ఓ పద్ధతి ఉంటుంది.

డైరెక్టర్ శివతో కనెక్ట్ అయ్యేందుకు నాకు ఓ నెల రోజుల టైమ్ పట్టింది. ఫస్ట్ ఏదైనా నచ్చుకుంటే బాగా లేదని ఓపెన్ గా చెప్పేవాడిని. అది చూసిన సమంత ..విజయ్ ఏం చెప్పాలన్నా ఓ పద్ధతి ఉంటుంది..అలా ఫేస్ మీదే చెప్పకూడదు అని సజెస్ట్ చేసింది. శివ నేను కనెక్ట్ అయిన తర్వాత ఆయన మీద నాకు ఎంతో నమ్మకం ఏర్పడింది. పాటల దగ్గర నుంచి ప్రతీది ఆయన డెసిషన్ కే వదిలేశా. ఎందుకంటే శివకు సినిమా పిచ్చి. తన సినిమా ఎలా ఉండాలో ఖచ్చితంగా ఆయనకు తెలుసు. ఆ ఫ్రేమ్ నుంచి బయటకు రాడు. మనం ఏదైనా బాగుంటుందని చెబితే నచ్చితే తీసుకుంటాడు. అది కథకు అవసరం ఉండదు అనుకుంటే ఎందుకు ఉండదో చెబుతాడు.

రొమాన్స్ కంటే ఫ‌న్ ఎక్కువ‌

ఖుషి సినిమాలో ఎమోషన్, రొమాన్స్, యాక్షన్ కంటే ఫన్ ను ఎక్కువగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్ తో మంచి కామెడీ వర్కవుట్ అయ్యింది. అలాగే సెకండాఫ్ లో రాహుల్ రామకృష్ణతో కలిసి నవ్విస్తాను.

ఆరోగ్యం బాగా లేకున్నా..

ఈ సినిమాలోని ఖుషి టైటిల్ సాంగ్ వినగానే బాగా నచ్చింది. ఆ పాట ముందు మోషన్ పోస్టర్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనుకున్నాం. ఇంప్రెసివ్ గా ఉండటంతో సామ్, శివ, నేను కలిసి హేషమ్ తో మాట్లాడి దాన్ని ఫుల్ సాంగ్ చేశాం. ఖుషి పాటలను విన్నప్పుడు ఈ మ్యూజిక్ ను సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాం. అలా మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించాం. ఆ మ్యూజిక్ కన్సర్ట్ టైమ్ లో ఆరోగ్యం బాగా లేకున్నా సమంత పార్టిసిపేట్ చేసింది. ఆ స్టేజీ మీద సమంతతో లైవ్ పర్ ఫార్మ్ చేశాను.

మా ఇద్దరిలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి

సమంత తెలివైన అమ్మాయి. శివ, నేను మూవీ గురించి డిస్కస్ చేసేప్పుడు ఆమె మంచి ఐడియాస్ చెప్పేది. మా ఇద్దరిలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. మేమిద్దరం మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం కాబట్టి డబ్బు,లైఫ్ గురించి ఒకేలా ఆలోచనలు ఉంటాయి. అలాగే మా ఇద్దరికీ హిస్టరీ అంటే ఇష్టం. సమంత దేవుడిని ఆరాధిస్తుంది. నేను మతపరమైనవి, దేవుడి గురించి డౌట్స్ అడుగుతుంటా. సమంతతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంటుంది.

బిగ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ చూశాను

లైఫ్ లో ఫెయిల్యూర్ చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి ఫెయిల్యూర్ అనేది ఏదో ఒక టైమ్ లో తప్పకుండా ఎదురవుతుంది. నేనూ లైఫ్ లో బిగ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ చూశాను. వాటి గురించి బయట చాలా మంది మాట్లాడారు. నా దృష్టిలో ఫెయిల్యూర్, సక్సెస్ ఒకేలా చూడాలి. చేసిన తప్పులు చేయకుండా అపజయాల నుంచి నేర్చుకోవాలి. ఫెయిల్యూర్ మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. జీవితం అంటే ఓడటం, గెలవడం కాదు జీవించడం. లైఫ్ లో మిమ్మల్ని మీరు ఏ పొజిషన్ లో చూడాలని అనుకుంటున్నారో ఆ గమ్యం వైపు ఒక్కో అడుగు వేస్తూ వెళ్లండి.

హడావుడి లేకుండా నా మ్యారేజ్..

నన్ను కేరింగ్ గా చూసుకునే లైఫ్ పార్టనర్ కావాలని కోరుకుంటా. నేను వర్క్ లో పడి ఫుడ్ వంటి బేసిక్ థింగ్స్ కూడా మర్చిపోతా. వర్క్ నుంచి బయటకు తీసుకొచ్చి పర్సనల్ లైఫ్ గుర్తుచేసే భార్య ఉండాలి. ఇప్పుడు మా అమ్మ నా గురించి జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ ఇయర్, నెక్ట్ ఇయర్ అంటూ పెళ్లికి టైమ్, డేట్ ఫిక్స్ చేసుకోలేదు. మ్యారేజ్ చేసుకోవాలని అనిపించినప్పుడు తప్పకుండా చేసుకుంటా. అయితే పెద్ద హడావుడి లేకుండా నా మ్యారేజ్ జరగాలి. కానీ ఎవరికీ తెలియకుండా నేను ఆ విషయాన్ని దాచలేను.

  • సోషియో ఫాంటసీ మూవీ జానర్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అయితే ఆ స్క్రిప్ట్స్ ఆకట్టుకునేలా రాయడం కష్టం. అలాంటి స్క్రిప్ట్స్ వస్తే తప్పకుండా నటిస్తా.
  • నాకు డ్రీమ్ క్యారెక్టర్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. ఇప్పుడు చేసిన ఖుషి, తర్వాత చేస్తున్న వీడీ 12, వీడీ 13 సినిమాలకు సూపర్బ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. అలాంటి స్క్రిప్ట్స్ లో నటిస్తానని ఊహించలేదు.
  • సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో నా మూవీ తప్పకుండా ఉంటుంది. ఎప్పుడనేది మాత్రం చెప్పలేను.
  • తమిళ్ డైరెక్టర్స్ అరుణ్ మాతేశ్వరన్, అరుణ్ ప్రభు ఇద్దరూ టాలెంటెడ్. వారితో స్క్రిప్ట్స్ వర్క్స్ జరుగుతున్నాయి. స్క్రిప్ట్స్ లాక్ అయితే వెంటనే మూవీస్ ప్రారంభిస్తా.
  • నాకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు. లైగర్ ఫ్లాప్ అయినప్పుడు నెక్ట్ మూవీ హిట్ కొట్టాలి అన్నా అనేవారు. వాళ్ల ముఖాల్లో సంతోషం చూసేందుకు ఖుషితో హిట్ కొట్టబోతున్నాం.
  • గ్లాడియేటర్ నా ఫేవరేట్ మూవీ. పోకిరి సినిమాలో మహేశ్ ఇంట్రడక్షన్ సీన్ ఇష్టం. అలాంటి ఇంట్రో నా మూవీలో ఒకటి పెట్టుకోవాలి. అదెప్పుడు కుదురుతుందో చూడాలి.
Read Moreసుధీర్ హీరోగా నటిస్తున్న గోట్ చిత్రం గ్లింప్స్

ట్రెండింగ్ వార్తలు