January 4, 2022
VijayDevarakonda-RashmikaMandanna: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా సినీస్టార్స్ అందరూ గోవాకి వెళ్లారు. కొందరు విదేశాలకు వెళ్లాలనుకున్న అక్కడ కొన్ని ఉన్న ఆంక్షలు, ఒమిక్రాన్ వేరియంట్ భయం వంటి వాటి వల్ల గోవాకు వెళ్లారు. కానీ అక్కడ ఇండస్ట్రీలో ప్రేమికులుగా చెప్పుకోబడుతున్న విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా ఉన్నారు. వీరితో పాటు ఆనంద్ దేవరకొండ కూడా గోవాలోనే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు. విజయ్, రష్మికాలు కలిసి ఉన్న ఫోటోలు అయితే బయటకు రాలేదు కానీ ఈ ఇద్దరి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మాత్రం గోవాలోని ఒకే చోట జరిగాయి. ఇటీవల ముంబైలో విజయ్, రష్మికా డిన్నర్ చేసిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఇప్పుడు గోవాలో సెలబ్రేషన్స్. ఇలా..చాటుమాటు లవ్ ఎందుకు? డైరెక్ట్‌గానే చెప్పవచ్చు కదా! అని కొందరు నెటిజన్లు అంటున్నారు.