ఆగస్టులోనే రాబోతున్న విజయ్ గోట్?

March 25, 2024

ఆగస్టులోనే రాబోతున్న విజయ్ గోట్?

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు విజయ్ తళపతి ఒకరు. ఈయన హీరోగా కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈయన హీరోగా ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే త్వరలోనే ఈయన తన సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారని రాజకీయాలలో బిజీ కాబోతున్నారని తెలుస్తుంది.

విజయ్ హీరోగా ఇటీవల లియో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది ఈ సినిమా తర్వాత ఈయన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (గోట్) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రాబోతున్నటువంటి ఈ సినిమాలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నిమిత్తం చిత్ర బృందం రష్యా వెళ్తున్నారని తెలుస్తుంది. ఇలా చివరి దశ షూటింగ్ పనులను జరుపుకుంటూ ఉన్నటువంటి ఈ సినిమా ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం మే మొదటి వారంలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇలా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు.

ఇక ఈ సినిమాలో ప్రభుదేవా, స్నేహ, లైలా వంటి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ కూడా విడుదల చేసే పనిలో దర్శకుడు బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ గోట్ ఫస్ట్ లుక్ మేకింగ్ విత్ నా తలపతి అంటూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ చూస్తుంటే త్వరలోనే పోస్టర్ కూడా రాబోతుందని తెలుస్తుంది.

Read More: జులైని టార్గెట్ చేస్తున్న మిస్టర్ బచ్చన్?

ట్రెండింగ్ వార్తలు