March 25, 2024
ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస సినిమాలలో అవకాశాలు అందుకున్నటువంటి వారిలో నటుడు రవితేజ ఒకరు. కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలైనటువంటి ఈయన ప్రయాణం అనంతరం చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలను అందుకున్నారు అయితే ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో హీరోగా ఇండస్ట్రీలో ఎంత పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారని చెప్పాలి.
ఇలా హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయినటువంటి రవితేజ ఇటీవల ఈగల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. త్వరలోనే ఈయన మిస్టర్ బచ్చన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. షాక్ మిరపకాయ్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించినటువంటి డైరెక్టర్ హరీష్ శంకర్ రవితేజతో ముచ్చటగా మూడోసారి మిస్టర్ బచ్చన్ అనే సినిమా ద్వారా రావడానికి సిద్ధమయ్యారు.
వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ సినిమా హిందీలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి సినిమాకు రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో రవితేజ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఇక చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకున్నటువంటి ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం.
పనోరమా స్టూడియోస్ టి సిరీస్ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ద్వారా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ప్రస్తుతం చివరి దశ షెడ్యూల్ జరుపుకున్నటువంటి ఈ సినిమా జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుందని తెలుస్తోంది.
Read More: ఆ పెళ్ళికి నన్ను ఎందుకు పిలవలేదు.. ఆనంద్ మహేంద్రాను ప్రశ్నించిన చరణ్.. రిప్లై ఏంటో తెలుసా?