గుంటూరు కారం కొత్త పోస్టర్.. మీనాక్షి పోస్టర్ మీద ఫన్నీ మీమ్స్, ట్రోల్స్!

January 5, 2024

గుంటూరు కారం కొత్త పోస్టర్.. మీనాక్షి పోస్టర్ మీద ఫన్నీ మీమ్స్, ట్రోల్స్!

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం గుంటూరు కారం. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. శ్రీ లీలా హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇదే కాకుండా ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

అయితే విడుదల తేదీకి మరి కొద్దిరోజులే సమయం ఉండడంతో మూవీ మేకర్స్ ప్రస్తుతం ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. జనవరి 6 న ట్రైలర్, ప్రీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసారు. ఈ ఈవెంట్‌ని అమెరికా థియేటర్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ కూడా ఇవ్వబోతున్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ మీనాక్షి చౌదరి పాత్రని పరిచయం చేస్తూ మూవీ టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. లంగా వోణీలో క్యూట్‌‌గా ఉన్న మీనాక్షి మహేష్ బాబు భుజాలపై చేతులు వేసుకుని నిలబడి ఉంది. ఈ సినిమాలో రాజీ అనే పాత్రలో మీనాక్షిని పరిచయం చేస్తూ మూవీ టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.

కాగా ఈ సినిమాలో మహేష్ బాబు-మీనాక్షి చౌదరి మధ్య వచ్చే సీన్స్ హైలైట్ కాబోతున్నాయట. రొమాంటిక్‌గా, టీజింగ్ ఉంటాయని తెలుస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా విడుదల చేసిన మీనాక్షి పోస్టర్ పై నేటిజన్స్ భారీగా ట్రోల్లింగ్ చేస్తూ కొన్ని మీమ్స్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే మూవీ మేకర్స్ షేర్ చేసిన పోస్టర్ లో మీనాక్షి మహేష్ బాబు భుజాలపై చేతులు వేసుకొని వెనుక వైపు నిలబడగా మీమ్స్ లో జూనియర్ ఎన్టీఆర్ భుజాలపై చేతులు వేసుకుని నిలబడినట్టుగా ఫోటోని ఎడిట్ చేసి వాటిని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

అలాగే మరొక దాంట్లో మరొక నటుడి భుజాలపై చేతులు వేసుకొని నిలబడినట్టుగా ఫోటోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన మీమ్స్ ట్రోలింగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

https://twitter.com/sitharamaraju_7/status/1742809383254495456

Read More: బికినీలో రకుల్ పోజులు.. ఆ ఫోటోలు తీసింది ఈ హీరోయినా?

ట్రెండింగ్ వార్తలు