ర‌ణ్వీర్ సింగ్ – దీపికా ప‌దుకొనె `83` టీజ‌ర్..

November 27, 2021

ర‌ణ్వీర్ సింగ్ – దీపికా ప‌దుకొనె `83` టీజ‌ర్..
భార‌త క్రికెట్ చ‌రిత్రలో సువ‌ర్ణాక్ష‌రాల‌తో రాయ‌దగ్గ అధ్యాయం 1983లో భార‌త క్రికెట్ జ‌ట్టు తొలిసారి విశ్వ విజేత‌గా ఆవిర్భ‌వించడం. ఎన్నో ఉత్కంఠ‌మైన మ‌లుపుల‌తో ద‌క్కిన గెలుపు అది. అలాంటి ఆసాధార‌ణ ప్ర‌యాణాన్ని వెండితెర‌పై `83` సినిమాగా ఆవిష్క‌రిస్తున్నారు డైరెక్ట‌ర్ క‌బీర్ ఖాన్‌. ఈ సినిమాలో క‌పిల్ డేర్ డెవిల్స్ ప్ర‌స్థానం ఎలా సాగింది? వారికి ఎదురైన స‌వాళ్లు ఏంటి? అనే విష‌యాల‌ను చూపించ‌నున్నారు.క‌పిల్ దేవ్‌గా ర‌ణ్వీర్ సింగ్‌, క‌పిల్ స‌తీమ‌ణి రూమీ భాటియాగా దీపికా ప‌దుకొనె, సునీల్ గ‌వాస్క‌ర్‌గా తాహిర్ రాజ్ బాసిన్‌, కృష్ణ‌మాచార్య శ్రీకాంత్‌గా జీవా, మ‌ద‌న్ లాల్‌గా హార్డీ సందు, మ‌హీంద్ర‌నాథ్ అమ‌ర్‌నాథ్‌గా స‌కీబ్ స‌లీమ్‌, బ‌ల్వీంద‌ర్ సంధుగా అమ్మి విర్క్‌, వికెట్ కీప‌ర్ స‌య్య‌ద్ కిర్మాణిగా సాహిల్ క‌త్తార్‌, సందీప్ పాటిల్‌గా చిరాగ్ పాటిల్‌, దిలీప్ వెంగ్‌స‌ర్కార్‌గా అదినాథ్ కొతారె, ర‌విశాస్త్రిగా కార్వా.. మేనేజ‌ర్ మాన్‌సింగ్‌గా పంక‌జ్ త్రిపాఠి త‌దిత‌రులు న‌టించారు.శుక్ర‌వారం ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. జూన్ 25, 1983న లార్డ్స్ మైధానంలో ఇండియా -వెస్టిండిస్‌ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగింది. ఆ మ్యాచ్ లో వెస్టిండీస్ కెప్టెన్ వివియ‌న్ రిచ‌ర్డ్స్ కొట్టిన బంతిని భార‌త కెప్టెన్ క‌పిల్ దేవ్ 20 గ‌జాలు వెన‌క్కి ప‌రిగెత్తుకుంటూ వెళ్లి క్యాచ్ ప‌ట్టాడు. ఆ క్యాచ్ ఆట‌ను మ‌లుపుతిప్పింది. ఆ స‌న్నివేశాన్నే టీజ‌ర్‌లో ఆవిష్క‌రించారు. ‘83’ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 24న విడుద‌ల చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు.  

ట్రెండింగ్ వార్తలు