ప్ర‌భాస్ `ప్రాజెక్ట్ కె` రిలీజ్‌డేట్‌పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన నిర్మాత‌ అశ్వ‌నిద‌త్‌

January 9, 2022

ప్ర‌భాస్ `ప్రాజెక్ట్ కె` రిలీజ్‌డేట్‌పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన నిర్మాత‌ అశ్వ‌నిద‌త్‌

Prabhas Project K Release Date Locked: రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ప్రాజెక్ట్ K (Project K) వర్కింగ్ టైటిల్ తో భారీ సైన్స్ ఫిక్షన్, ఫాంటసి మూవీ తెర‌కెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇండియాలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే వంటి బాలీవుడ్ స్టార్ట్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. 500 కోట్లకు పైగా భారీ వ్యయంతో ఈ సినిమాను అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీ రిలీజ్‌ డైట్‌పై క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు నిర్మాత అశ్విని ద‌త్‌..ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఈ మూవీని మే 2023లో విడుద‌ల చేయనున్నామ‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం రామోజీఫిలిం సిటీలో వేసిన భారీ సెట్లో ఈ మూవీ షూటింగ్ జరుగున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే అమితాబ్ పాత్ర‌కి సంబందించి షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌పై స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ప్రభాస్ న‌టించిన రాధేశ్యామ్ స‌మ్మ‌ర్‌లో విడుద‌లయ్యే అవ‌కాశం ఉంది. Read Moreమ‌రుజ‌న్మ‌లోనూ నువ్వే నా అన్న‌య్య‌గా పుట్టాలి – మ‌హేశ్‌బాబు

ట్రెండింగ్ వార్తలు