‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ లో జాయిన్ అయిన ప్ర‌భాస్‌…ఇండియా బిగ్గెస్ట్ సూప‌ర్ స్టార్స్ అంటూ వీడియో విడుద‌ల‌

December 11, 2021

‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ లో జాయిన్ అయిన ప్ర‌భాస్‌…ఇండియా బిగ్గెస్ట్ సూప‌ర్ స్టార్స్ అంటూ వీడియో విడుద‌ల‌

ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేష‌న్లో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న భారీ చిత్రం ప్రాజెక్ట్ కె (వ‌ర్కింగ్ టైటిల్‌). దీపికా పదుకొణె హీరోయిన్‌. ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంభందించి అమితాబ్ బ‌చ్చ‌న్ షూటింగ్ పూర్త‌య్యింది. వారం రోజులు అన్నపూర్ణ ఏడెకరాల్లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో దీపికాపై ప‌లు స‌న్నివేశాలు చిత్రీక‌రించారు.

ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్ర‌త్యేకంగా వేసిన అత్యంత భారీ సెట్‌లో ప్రభాస్ దీపికా పదుకొణె మధ్య కీల‌క‌మైన స‌న్నివేశాల‌ను తెరకెక్కించారు. భారీ వ్యయంతో కొత్త ప్రపంచాన్ని సెట్‌గా రూపొందించారని తెలుస్తోంది.

`ఇండియా బిగ్గెస్ట్ సూప‌ర్ స్టార్స్ వ‌రల్డ్ బిగ్గెస్ట్ కెమెరా కోసం చేతులు క‌లిపారు` అని చిత్రయూనిట్ ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో ప్రభాస్, దీపికా పదుకొణె చేతులు కల‌ప‌డం మ‌నం చూడొచ్చు.

వైజయంతీ మూవీస్ ప‌తాకంపై  అశ్విని ద‌త్ 500 కోట్ల అత్యంత భారీ బ‌డ్జెట్‌తో పాన్ వ‌ర‌ల్డ్ స్థాయిలో ఈ సినిమాను నిర్మించ‌నున్నారు.

ట్రెండింగ్ వార్తలు