క్రికెట్ అభిమానుల‌కు గూజ్‌బ‌మ్స్ తెప్పిస్తున్న రణ్‌వీర్‌ సింగ్ `83` ట్రైల‌ర్‌

November 30, 2021

క్రికెట్ అభిమానుల‌కు గూజ్‌బ‌మ్స్ తెప్పిస్తున్న రణ్‌వీర్‌ సింగ్ `83` ట్రైల‌ర్‌

1983వ సంవ‌త్స‌రంలో భార‌త క్రికెట్ జ‌ట్టు విశ్వ విజేత‌గా ఆవిర్భ‌వించిన అసాధార‌ణ ప్ర‌యాణాన్ని వెండితెర‌పై `83` సినిమాగా ఆవిష్క‌రిస్తున్నారు డైరెక్ట‌ర్ క‌బీర్ ఖాన్‌. క‌పిల్ దేవ్ జీవిత నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్కుతుంది. రణ్‌వీర్‌ సింగ్, దీపికా పదుకొనె, జీవా, తాహీర్‌ రాజ్‌ భాసీన్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. డిసెంబర్‌ 24 దేశ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులోని కొన్ని స‌న్నివేశాలు క్రికెట్ అభిమానులకు గూజ్‌బ‌మ్స్ తెప్పించేలా ఉన్నాయి. కపిల్‌ దేవ్‌గా రణ్‌వీర్‌ సింగ్‌ పూర్తిగా ట్రాన్స్‌ఫాం అయ్యాడు. అద్భుత‌మైన షాట్స్‌తో ఇండియాకి విజ‌యాన్ని అందించాడు క‌పిల్. ఆ స‌న్నివేశాల‌ను అద్భుతంగా చూపించారు.

అన్న‌పూర్ణ స్టూడియోస్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో క‌బీర్‌ఖాన్ ఫిలిమ్స్ నిర్మాణంలో దీపికా ప‌దుకొనె, సాజిద్ న‌డియ‌ద్‌వాలా, క‌బీర్ ఖాన్‌, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంట‌మ్ ఫిలింస్ ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాను నిర్మించారు. ఈ సినిమాలో క‌పిల్ డేర్ డెవిల్స్ ప్ర‌స్థానం ఎలా సాగింది? వారికి ఎదురైన స‌వాళ్లు ఏంటి? అనే విష‌యాల‌ను 83 సినిమాలో ఆవిష్కరించారు డైరెక్ట‌ర్ క‌బీర్ ఖాన్‌.

ట్రెండింగ్ వార్తలు