జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడానికి అదే కారణం.. క్లారిటీ ఇచ్చిన అనసూయ?

March 28, 2024

జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడానికి అదే కారణం.. క్లారిటీ ఇచ్చిన అనసూయ?

బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి అనసూయ ఒకరు. ఈమె ఇండస్ట్రీలో కెరియర్ పరంగా ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన ప్రయాణం మాత్రం బుల్లితెరపైనే ప్రారంభమైంది పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఉన్నటువంటి అనసూయ అనంతరం జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించే బాధ్యతలు తీసుకున్నారు.

ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూ ఉన్నటువంటి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా అనసూయ యాంకరింగ్ చేయటం వల్ల ఈ కార్యక్రమానికి అద్భుతమైనటువంటి రేటింగ్ కూడా వచ్చిందని చెప్పాలి. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులర్ అయినటువంటి ఈమె అభిమానులను కూడా భారీ స్థాయిలో సొంతం చేసుకున్నారు అయితే ఉన్నఫలంగా జబర్దస్త్ కార్యక్రమం నుంచి అనసూయ తప్పుకున్నారు.

ఇలా జబర్దస్త్ కార్యక్రమం నుంచి ఈమె తప్పుకోవడానికి గల కారణాలు ఏంటని అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేశారు అయితే గతంలో అనసూయ జబర్దస్త్ కార్యక్రమంలో యాంకర్ గా పని చేయాలి అంటే కమెడియన్లు చేసే కామెంట్లను కూడా భరించాలి. అక్కడ మనకు ఎంత ఇబ్బంది కరంగా ఉన్నా పైకి మాత్రం వెకిలి నవ్వులు నవ్వుతూ కూర్చోవాలని, కొన్నిసార్లు మనకు నచ్చకపోయినా కొన్ని పనులు చేయాల్సి వస్తోంది అంటూ కామెంట్లు చేశారు.

ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అనసూయ ఎక్కువ మరోసారి ఇదే ప్రశ్న ఎదురయింది. జబర్దస్త్ నుంచి మీరే వెళ్ళిపోయారా లేకుంటే మిమ్మల్ని ఎవరైనా పంపించేశారా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ మనల్ని ఎవరూ పంపించేసేది అక్కడ నుంచి అంటూ కామెంట్ చేశారు. నన్ను ఎవరు పంపించలేదని నేనే వచ్చేసానని సినిమా అవకాశాలు ఎక్కువగా రావడం వల్ల జబర్దస్త్ షూటింగ్ ఆలస్యం అవుతుందని మన వల్ల ఒకరు బాధపడటం దేనికని భావించి నేనే ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నాను అంటూ ఈమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Read More: యుఎస్ లో టిల్లు స్క్వేర్ రికార్డ్స్.. రిలీజ్ కి ముందే భారీ బిజినెస్!

ట్రెండింగ్ వార్తలు