ఆ విషయంలో విజయ్‌కి పోటీగా విశాల్.. ఈసారి ఫోటాపోటీ మామూలుగా ఉండదంటూ?

February 7, 2024

ఆ విషయంలో విజయ్‌కి పోటీగా విశాల్.. ఈసారి ఫోటాపోటీ మామూలుగా ఉండదంటూ?

సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అన్నది కామన్. ఎన్టీ రామారావు కాలం నుంచి సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు చాలామంది రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి కొందరు సక్సెస్ అవ్వగా మరి కొందరు సరైన విధంగా సక్సెస్ కాకపోవడంతో వెనుతిరిగి మళ్లీ సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలలో రాణించారు. ఒక తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఎంతోమంది సెలబ్రిటీలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎంజీఆర్, అన్నాదురై, కరుణానిధి, జయలలిత ఇలా ఎంతోమంది రాజకీయాలలో బాగా సక్సెస్ అయ్యారు. ఇకపోతే ఎప్పటి నుంచో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ఊరిస్తూ వచ్చిన రజనీకాంత్‌.. చివరి క్షణంలో వెనకడుగు వేశారు.

ఆయన తర్వాత నిర్ణయం తీసుకున్న కమలహాసన్‌.. మక్కల్‌ నీతి మయ్యం పేరుతో పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల్లో గెలవకపోయారు. ప్రముఖ హీరో దళపతి విజయ్‌ ఈ మధ్యే రాజకీయాల్లో వచ్చేశారు. పార్టీ పేరుతో సహా నోట్ విడుదల చేశారు. పూర్తిగా రాజకీయలపై దృష్టిపెట్టిన విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పినట్లు కూడా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు హీరో విశాల్‌ కూడా రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధం అంటున్నట్లు తాజా సమాచారం. చెప్పాలంటే విశాల్ చాలా కాలం క్రితమే రాజకీయాల్లోకి వచ్చారు. ఆ మధ్య శాసనసభ ఎన్నికల్లో ఆర్‌కే నగర్‌ నుంచి పోటీ చేయడానికి నామినేషన్‌ కూడా వేశారు.

కానీ దీన్ని తిరస్కరించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కాగా విశాల్‌ తన అభిమాన సంఘాన్ని ప్రజా రక్షణ సంఘంగా మార్చి ప్రజాసేవలో మమైకమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తన సినిమాల షూటింగ్‌ జరుగుతున్నప్పుడు అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిశీలిస్తూ వస్తున్నారు. రాబోయే 2026 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి త్వరలోనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవైపు విజయ్ మరొకవైపు విశాల్ ఈసారి మాత్రం పోటీ మామూలుగా ఉండదంటూ కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

Read More: ఆ ఒక్కటి అడగొద్దు.. హీరోయిన్ మంజూ వారియర్ కామెంట్స్ వైరల్?

ట్రెండింగ్ వార్తలు