April 22, 2024
తమిళ హీరో దళపతి విజయ్ గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు విజయ్. ఇది ఇలా ఉంటే విజయ్ దళపతి నటించిన గిల్లీ సినిమా మనందరికీ గుర్తుండే ఉంటుంది. 2004లో విజయ్ త్రిష కాంబోలో వచ్చిన ఈ రీమేక్ మూవీ అప్పట్లోనే సరికొత్త రికార్డులను సృష్టించింది. తెలుగులో హీరో మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమాను తమిళంలో గిల్లీ అంటూ విజయ్ రీమేక్ చేసిన విషయం తెలిసింది దాదాపు 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందట. 200 రోజులు చాలా సెంటర్లలో ఆడిందట.
విజయ్ కెరీర్‌లో గిల్లీ అనేది ఒక మైలురాయిగా నిలిచింది. ఇది ఇలా ఉంటే ఏప్రిల్ నెలలో ఎన్నికలు ఉండటంతో పెద్ద సినిమాలేవీ రిలీజ్ చేయడం లేదట. అందుకే విజయ్ పాత మూవీ గిల్లీని రీ రిలీజ్ చేశారు. విజయ్ గిల్లీ చిత్రాన్ని ఏప్రిల్ 20న తమిళనాడుతో పాటుగా, ఓవర్సీస్ లోనూ భారీ ఎత్తున రీ రిలీజ్ చేశారు. దాదాపు 800 థియేటర్లలో ఈ మూవీని మళ్లీ విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. రీ రిలీజ్ డే సందర్భంగా గిల్లీ మూవీకి దాదాపు పది కోట్ల గ్రాస్ వచ్చి ఉంటుందని తమిళ నాడు మీడియా వార్తలు రాసుకొస్తోంది. దీంతో విజయ్ ఫ్యాన్ బేస్ గురించి మరోసారి చర్చలు జరుగుతున్నాయి.
టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ ఎంతగా ఊపందుకుందో అందరికీ తెలిసిందే. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా చాలా మంది హీరోల సినిమాలను రీ రిలీజ్ చేశారు. రీసెంట్‌గానే హ్యాపీడేస్ మూవీని కూడా రీ రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమా తెలుగు సినిమాలన్నింటికంటే కూడా ఎక్కువ మొత్తంలో కలెక్షన్స్ ను సాధించి రీ రిలీజ్ సినిమాలలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది.
Read More: సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసిన నాని.. గుండె బరువెక్కిందంటూ?