రాజకీయాల్లోకి హీరో విజయ్.. పొలిటికల్ పార్టీ పేరు ఇదే!

February 2, 2024

రాజకీయాల్లోకి హీరో విజయ్.. పొలిటికల్ పార్టీ పేరు ఇదే!

సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి విడదీయరాని అనుబంధం ఉంది. సినిమా ఇండస్ట్రీలో నటీనటులుగా కొనసాగుతూ ఎంతో మంది రాజకీయాలలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇలా రాజకీయాల్లోకి వెళ్లినటువంటి వారు రాజకీయాలలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇప్పటికీ ఎంతోమంది స్టార్ హీరోలు హీరోయిన్లు రాజకీయాలలోకి అడుగుపెడుతున్న విషయం మనకు తెలుసు..కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు విజయ్ తలపతి ఒకరు.

ఈయన కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఇక్కడ కూడా అదే స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.. ఇలా నటుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి ఈయన ఇటీవల కాలంలో రాష్ట్ర రాజకీయాలపై చాలా ఆసక్తి కనబరిచిన సంగతి తెలిసిందే. ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి తమిళనాడులో ప్రజల కష్టాలను తీరుస్తూ వస్తున్నారు వరద బాధితులను ఆదుకోవడం చదువులో టాప్ వచ్చిన వారికి స్కాలర్షిప్ అందజేయడం వంటివి చేస్తున్నారు.

ఇలా స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఏమాత్రం మార్చలేమని గ్రహించినటువంటి ఈయన ఈ పరిస్థితులు మారాలి అంటే అధికారం కూడా అవసరమని తెలుసుకొని రాజకీయాలలోకి రావాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే నేడు ఈయన తన పార్టీ పేరును కూడా అధికారకంగా ప్రకటించారు. విజయ్ ఈ సందర్భంగా రాజకీయాలలోకి రాబోతున్నట్లు ప్రకటించడమే కాకుండా తన పార్టీకి తమిళక వెట్రి కజగం పేరును కూడా ప్రకటించారు.

ఇలా రాజకీయాలలోకి వచ్చినటువంటి ఈయన ప్రస్తుత రాజకీయ వాతావరణంలో పాలనాపరమైన దురాచారాలు, అవినీతి రాజకీయ సంస్కృతి, కులమత విభజన వంటి దురాచారాలు ఎక్కువయ్యిపోయాయని. తాను వాటికీ విరుద్ధంగా ప్రజలు కోరుకునే మౌలికమైన రాజకీయ మార్పుకు నాయకత్వం వహించడమే తన లక్ష్యమని తెలియజేశారు. ఇకపోతే మరికొద్ది రోజులలో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి తరుణంలో తాము ఆ ఎలక్షన్స్ లో పోటీ చేయలేదని 2026 లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్లు విజయ్ తెలిపారు.

Read More: సోషల్ మీడియా ట్రెండింగ్ లోకి శ్రీలీల.. కారణం అదే!

ట్రెండింగ్ వార్తలు