AlluArjun: సంజ‌య్ లీలా భ‌న్సాలీతో బ‌న్ని..

March 15, 2022

AlluArjun: సంజ‌య్ లీలా భ‌న్సాలీతో బ‌న్ని..

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పుష్ప సినిమా అనూహ్యంగా హిందీలో 100కోట్లు వ‌సూలు చేయ‌డంతో బాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాలు షాక‌య్యాయి. స‌రైన ప్ర‌మోష‌న్స్ లేకుండానే 100 కోట్ల మార్కును అందుకోవ‌డంతో ఇప్పుడు అల్లు అర్జున్(AlluArjun) మీద ఫోక‌స్ పెట్టాయి బాలీవుడ్ వ‌ర్గాలు. ఇక పుష్ప 2 త‌ర్వాత బాలీవుడ్ సినిమా చేసి ఆ మార్కెట్‌ను మరింత పెంచుకునే ఆలోచ‌న‌లో ఉన్నాడు బ‌న్నీ… ఇప్పుడు అల్లు అర్జున్(AlluArjun) చేయ‌బోయే బాలీవుడ్ సినిమా గురించి ఆస‌క్తిక‌ర‌మైన‌ వార్తలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

బాలీవుడ్ లో ఎన్నో కళాత్మక, చారిత్రక చిత్రాల్ని నిర్మించి, దర్శకత్వం వహించిన సంజ‌య్ లీలా భన్సాలీతో బన్నీ ఒక అదిరిపోయే సినిమాకి ఓకే చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. ఒక దక్షిణాది యోధుని జీవిత చరిత్ర ఆధారంగా భన్సాలీ ఒక పీరియాడిక్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట‌, అందులో బన్నీ హీరోగా నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ హీరో బాలీవుడ్ ఫిల్మ్ మేక‌ర్ సంజ‌య్ లీలా భ‌న్సాలీ ఆఫీసుకు కూడా వెళ్లి రావ‌డంతో ఈ చ‌ర్చ మ‌రింత ప్రాముఖ్య‌త‌ను సొంతం చేసుకుంది. మ‌రి చూడాలి సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ సినిమా ఉంటుందో లేదో.. త్వరలోనే ఈ కాంబో మూవీపై క్లారిటీ రానుంది.

ReadMore: ShekarKammula: యంగ్ టీమ్‌ చేసిన `ఫోక‌స్`టీజ‌ర్ చాలా బాగుంది

ట్రెండింగ్ వార్తలు