ఎట్టకేలకు ఓటీటీ లో విడుదల కాబోతున్న హీరామండీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ అంటే!

March 29, 2024

ఎట్టకేలకు ఓటీటీ లో విడుదల కాబోతున్న హీరామండీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ అంటే!

ఎన్నో ప్రతిష్టాత్మకమైన సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఒక పిరియాడిక్ డ్రామా సిరీస్ ని రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ ఇంకా విడుదల కాకముందే సినిమాపై భారీగా బజ్ క్రియేట్ అయింది. ఈ సిరీస్ పేరు “హీరామండీ: ద డైమండ్ బజార్”. ఈ సిరీస్ షూటింగ్ రెండేళ్ల క్రితమే ప్రారంభమైనప్పటికీ అనివార్య కారణాల వలన రిలీజ్ కి ఆలస్యం అవుతూ వచ్చింది.

అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఈ సిరీస్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా మే ఒకటవ తేదీ నుంచి ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సిరీస్ లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అతిధిరావు హైదరి, సంజీదా షేక్, షార్మిన్ సేగల్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని లాస్ట్ మంత్ రిలీజ్ చేసినప్పుడుమంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో ఈ సిరీస్ పై విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. ఇక కథ విషయానికి వస్తే 1940ల కాలంనాటి బ్యాక్ డ్రాప్ లో ఈ సిరీస్ ని రూపొందించారు. హీరామండీ అనే రెడ్ లైట్ ప్రాంతంలో జీవనం సాగించే కొంతమంది డాన్సర్స్ జీవితాల గురించి ఈ సిరీస్ లో చూపించారంట.

ఆ కాలంలో మహిళలు ఎదుర్కొన్న ఎన్నో సమస్యలను ఈ సిరీస్ లో కళ్ళకు కట్టినట్లు చూపించడం జరిగిందని సమాచారం. ఒక విధంగా హీరమండీ సిరీస్ బ్రిటిష్ కాలం నాటి పాలన కు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర ఉద్యమ సమయం నాటి కథ అని సమాచారం. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ని ఆధారంగా తీసుకొని రాబోతున్న ఈ సిరీస్ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Read More: లెజెండ్ మూవీ 10 సంవత్సరాల వేడుకలు.. రికార్డులు తనకేమీ కొత్త కాదంటున్న బాలకృష్ణ! 

ట్రెండింగ్ వార్తలు