April 5, 2024
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రష్మిక మందన్న ప్రస్తుతం వరుస భాషా చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలలో నటిస్తూ ఉన్నటువంటి రష్మిక ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఐదు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటూ కెరియర్ పట్ల ఎంతో బిజీ అయ్యారు.
ఇక రష్మిక మందన్న ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉన్నప్పటికీ ఒకప్పుడు ఉండటానికి సొంత ఇల్లు కూడా లేక రోడ్డున పడిన సందర్భాలు చాలా ఉన్నాయి అంటూ ఈమె ఓ సందర్భంలో వెల్లడించారు. ప్రస్తుతం హీరోయిన్గా కోట్లు సంపాదిస్తున్నటువంటి ఈమె చిన్నప్పుడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారట అయితే నేడు రష్మిక పుట్టినరోజు కావడంతో ఈమెకు సంబంధించిన విషయాలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి.
నేను బాల్యంలో ఉన్నప్పుడు మా అమ్మ నాన్నలు ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేశారు. కనీసం మాకు ఉండటానికి సొంత ఇల్లు కూడా లేదు ఆ ఇంటికి అద్దె కట్టడానికి కూడా స్తోమత ఉండేది కాదని ఇలా ఇంటి అద్దె చెల్లించలేకపోవడంతో ఇంటి ఓనర్స్ మమ్మల్ని ఇల్లు కాలి చేయమని చెప్పేవాళ్లు ఇలా పలు సందర్భాలలో రోడ్డున పడిన సందర్భాలు చాలా ఉన్నాయని రష్మిక తెలిపారు.
చిన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా బొమ్మలు కొనుక్కొని ఆడుకోవాలని ఉంటుంది కానీ మా పరిస్థితి చూసి నేను ఒక బొమ్మ కూడా అడగలేదు. నేను అడిగితే మా తల్లిదండ్రులు కాదనరు కానీ వారు ఉన్న పరిస్థితులకు వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బొమ్మలతో ఆడుకోలేకపోయానని ఈమె తెలిపారు. ఇలా చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాము కనుక నేను డబ్బులకు చాలా విలువ ఇస్తాను. నేను బాల్యంలో పడిన కష్టాలు రీత్యా నా సక్సెస్ ని తేలిగ్గా తీసుకోనని రష్మిక చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Read More: అర్ధరాత్రి రోడ్డుపై ఐస్ క్రీమ్ తింటూ చిల్ అవుతున్న లేడీ సూపర్ స్టార్.. ఫోటోలు వైరల్!