ఆ హీరోపై పరోక్షంగా సెటైర్స్‌ వేసిన అల్లు అర్జున్

July 23, 2023

ఆ హీరోపై పరోక్షంగా సెటైర్స్‌ వేసిన అల్లు అర్జున్

‘బేబీ’ సినిమా సూపర్‌డూపర్‌ హిట్‌ సాధించింది. ఐదుకోట్ల లోపు బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద 50 కోట్ల రూపాయల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించింది. ఈ సినిమాలో ఆనంద్‌దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య ప్రధాన తారాగణం.

‘హృదయకాలేయం’, ‘కొబ్బరిమట్ట’  సినిమాలకు దర్శకుడిగాపని చేసి, ‘కలర్‌ఫోటో’ సినిమాకు రచయిత, నిర్మాతగా వ్యవహరించిన సాయిరాజేష్‌ ‘బేబీ’ సినిమాకు దర్శకత్వం వహించారు. మారుతితో కలిసి మాస్‌ మూవీ మెకర్స్‌ పతాకంపై ఎస్‌కేఎన్‌  నిర్మించారు. జూలై 14, 2023న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలైంది.

ఆనంద్‌దేవరకొండకు ‘బేబీ’ కథను వినిపించడానికి ముందు మరో ముగ్గురు హీరోలకు కథ వినిపించారు సాయిరాజేష్‌. ఈ విషయాన్ని ఆయనే ఇటీవల ఓ మీడియా సమావేశంలో ఒప్పుకున్నారు.

అయితే ‘బేబీ’ కథను వినిపించడానికి విశ్వక్‌సేన్‌ను సమయం కేటాయించవలసినదిగా అడగ్గా, విశ్వక్‌సేన్‌ తిరస్కరించారట. పైపెచ్చు..కొబ్బరిమట్ట వంటి సినిమా తీసిన దర్శకుడి కథను నేను విననని, ఆయనతో అసలు సమావేశమే వృథా అన్నట్లుగా విశ్వక్‌సేన్‌ అన్నారట.

ఇది సాయి రాజేష్‌ను ఎంతో భాదించింది. అయితే ఇప్పుడు సినిమా సక్సెస్‌ సాధించింది. దీంతో ట్విటర్‌ వేదికగా సాయిరాజేష్‌, విశ్వక్‌సేన్‌ లు ట్వీట్స్‌ వార్‌ చేసుకుంటున్నారు.ఈ మధ్య ‘బేబీ’ సినిమా అప్రియేషన్‌ మీట్‌ జరిగింది. అల్లు అర్జున్‌ అతిథిగా హాజరైయ్యారు. ‘బేబీ’ సినిమా బాగుందని కితాబులిచ్చారు.

సాయిరాజేష్‌ను మెచ్చుకున్నారు. పనిలో పనిగా విశ్వక్‌సేన్‌ ఇష్యూను పరోక్షంగా మాట్లాడారు. ‘ఆయన ఎవరో కథ వినడానికి మీటింగ్‌ కూడా వేస్ట్‌ అన్నాడట..’ అంటూ ఏదో మాట్లాడారు అల్లు అర్జున్‌. అంతే సినిమా లవర్లు, నెటిజన్లు అందిపుచ్చుకున్నారు. వెంటనే అది విశ్వక్‌సేన్‌ అన్నట్లుగా కామెంట్స్‌ చేస్తున్నారు. మరి..ఈ వివాదంలో ఎక్కడ ముగుస్తుందో చూడాలి.

గతంలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ దర్శకత్వంలో విశ్వక్‌సేన్‌ హీరోగా ఓ సినిమా మొదలైంది. ఇందులో అర్జున్‌ కుమార్తె ఐశ్వర్యాఅర్జున్‌ హీరోయిన్‌. ఇది ఐశ్వర్యకు తెలుగులో తొలి సినిమా కూడా. కానీ ఈ సినిమా ఆగిపోయింది. విశ్వక్‌నే కారణమంటూ అర్జున్‌ ఆరోపించారు. క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ అంటూ విశ్వక్‌సేన్‌ చెప్పుకొచ్చారు.

ప్రజెంట్‌ విశ్వక్‌సేన్‌ రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. మ‌రి చూడాలి ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుందో..

Read Moreత్రివిక్రమ్‌, తమన్‌లకు టైమ్‌ లేదు..బ్రో…

ట్రెండింగ్ వార్తలు