కొడుకుని చీపురుతో కొట్టిన సుమ‌..వీడియో వైర‌ల్‌!

December 31, 2023

కొడుకుని చీపురుతో కొట్టిన సుమ‌..వీడియో వైర‌ల్‌!

Bubblegum Movie: తెలుగు సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సుమా కనకాల ఒకరు. ఈమె యాంకర్ గత రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇకపోతే ఇటీవల ఈమె కుమారుడు రోషన్ కనకాల ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన సంగతి మనకు తెలిసిందే. ఈయన హీరోగా బబుల్ గమ్(Bubblegum Movie) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా డిసెంబర్ 29వ తేదీ విడుదలైంది. అయితే రోషన్ నటించిన మొదటి సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఈ సినిమా ప్రేమ కథ సినిమా కావడంతో కాస్త రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

ఇక తన కొడుకుని ఇండస్ట్రీలో ఎలాగైనా సక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో సుమ పెద్ద ఎత్తున తంటాలు పడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎక్కడికి వెళ్ళినా తన కుమారుడిని వెంటపెట్టుకొని వెళ్తూ సుమ అందరి ఫోకస్ తన కొడుకు పై పడేలాగా చేస్తున్నారు. అయితే ఇటీవల ఈ సినిమా విడుదలైనప్పటికీ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా అలాగే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే సుమ తాజాగా తన కొడుకుని చీపురుతో కొట్టినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రోషన్ తన గదిలో కూర్చుని ఈ సినిమాలోని గోవా సాంగ్ వింటూ ఉంటారు. అప్పటికి సుమా అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు రోషన్ అని అడగగా ఏం లేదమ్మా అంటారు. నీ సినిమాలోని గోవా సాంగ్ చూస్తున్నావ్ కదా నాకు చూపించ లేదు అంటూ సుమ అడగడంతో రోషన్ ఆ సాంగ్ చూపిస్తారు. అయితే ఈ పాటలో కాస్త బోల్డ్ సన్నివేశాలు, లిప్ కిస్ సన్నివేశాలు కూడా అధికంగా ఉండడంతో సుమ ఏకంగా చీపురు తీసుకువచ్చి తన కొడుకును కొట్టడానికి ప్రయత్నం చేయగా తను పారిపోతాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు సుమక్క మీ కొడుకును ఇండస్ట్రీలో నిలబెట్టడానికి బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేయగా, మరి కొందరు మాత్రం కొట్టాలి అంటే చీపురును తిప్పేయాలి అంటూ ఈమెకు సలహాలు ఇస్తున్నారు. మరొక నేటిజన్ అయితే ఏకంగా మా అమ్మ కూడా ఎగ్జాక్ట్ గా నన్ను ఇలా కొడుతుంది అంటూ ఈ వీడియో పై కామెంట్స్ చేశారు

 
 
View this post on Instagram
 

A post shared by Roshan Kanakala (@roshan____k)

Read Moreబబుల్ గమ్ రివ్యూ

ట్రెండింగ్ వార్తలు