కాస్త ఓవర్ ఐనట్టుందే.. సుమ కొడుకుపై ట్రోల్స్

December 25, 2023

కాస్త ఓవర్ ఐనట్టుందే.. సుమ కొడుకుపై ట్రోల్స్

టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కుమారుడు రోషన్(Roshan Kanakala) త్వరలోనే బబుల్ గమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 29వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోషన్ తనపై వచ్చినటువంటి ట్రోల్స్ గురించి మాట్లాడుతూ ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చారు. చాలామంది తన వెనకాలే అసలు వీడు హీరో ఏంటి ఇంత నల్లగా ఉన్నాడు అంటూ నా గురించి చాలామంది కామెంట్లు చేశారు అంటూ ఈ సందర్భంగా రోషన్ మాట్లాడారు.

ఒక మనిషికి సక్సెస్ తన కలర్ బట్టి రాదని తన టాలెంట్ బట్టి వస్తుంది అంటూ తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. అయితే ఈయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్నాయి. రోషన్(Roshan Kanakala) ఈ వేడుకలో మాట్లాడినటువంటి వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మేము ఖాళీగానే ఉన్నాము కానీ మరి నిన్ను ట్రోల్ చేసే అంత ఖాళీగా లేము అంటూ కొందరు కామెంట్లు చేయగా ఇలా మాట్లాడి మరో విజయ్ దేవరకొండ అవుదామని ట్రై చేస్తున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇల రోషన్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలను మరికొందరు కాస్త ఓవర్ అయినట్టు లేదు.. ఎవర్రా మీరంతా అంటూ భారీ స్థాయిలో రోషన్ కనకాలపై ట్రోల్స్ జరుగుతున్నాయి. రోషన్ ఇదంతా కేవలం తన సినిమాపై అటెన్షన్ కోసమే ఇలా మాట్లాడారని పలువురు భావిస్తున్నారు. ఏదిఏమైనా మొదటి సినిమాకి ఈయన తన మాటల ద్వారా భారీగానే ఫేమ్ అయ్యారని చెప్పాలి. మరి ఈయన నటించిన సినిమా తనకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

Read More: రోల్ రైడాతో కలిసి చేసిందట.. ఆగలేకపోతున్న అరియనా!?

ట్రెండింగ్ వార్తలు