రోషన్ ‘సుమా’రంభం!

January 2, 2024

రోషన్ ‘సుమా’రంభం!

అందమైన ఆకాశం వెలుగులీనుతూ ఉంటే అందులో తారగా మిగిలిపోవాలని ఎవరికి మాత్రం ఉండదు. చిత్రసీమలో సిల్వర్ స్క్రీన్ ని సినీ వినీలాకాశంగా భావించే ఎంతోమంది ఇక్కడ కూడా స్టార్స్ గా రాణించాలని కలలు కంటుంటారు. ఆ స్పేస్ లోకి ఎంటర్ అవడం ఒక ఎత్తయితే, ఎంటర్ అయిన తర్వాత నేల కూలకుండా నిలబడటం మరో సవాల్. ఎంట్రీకి ఎలాంటి సహకారం ఉన్నా, నిలదొక్కుకోవడం అన్నది పూర్తిగా టాలెంట్ పైన ఆధారపడి ఉంటుంది. స్టార్ లా వెలగాలని రీసెంట్ గా తెలుగు సినిమా అనే గ్యాలక్సీ లో చేరిన పేరు రోషన్ కనకాల.

దేవదాస్ కనకాల.. ఈ పేరు ప్రేక్షకులలో కొంతవరకు తెలుసున్నప్పటికీ సినీ పరిశ్రమలో ఆయనకంటూ ఓ స్థాయి, స్థానం ఉన్నాయి. రజనీకాంత్, చిరంజీవి మరియు రాజేంద్రప్రసాద్ స్టార్ లతో సహా ఎందరో నటులకు యాక్టింగ్ లో శిక్షణ ఇచ్చిన ఘనత ఆయనది. నటుడిగా, దర్శకుడిగానూ కొన్ని సినిమాలు చేశారు. ఆయన నట వారసుడైన రాజీవ్ కనకాల క్యారెక్టర్ నటుడిగా పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇదంతా ఈ కుటుంబ వెండితెర వెలుగైతే టీవీ వేదికగా తెలుగు వారి కుటుంబాల్లో ఒకరిగా మారిపోయారు సుమ కనకాల.

ఇలా రెండు ఇండస్ట్రీ ల బ్యాక్ గ్రౌండ్ తో బబుల్ గమ్ సినిమా(Bubblegum Movie 2023) ద్వారా హీరోగా తెరమీదికొచ్చాడు రోషన్ కనకాల. 2016లో ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాలో నటించినప్పటికీ హీరోగా రోషన్ కి ఇదే ఫస్ట్ ఫిల్మ్. బాయ్ నెక్స్ట్ డోర్ లాంటి పాత్రలో సేఫ్ గా ల్యాండ్ అయ్యాడు. లుక్ పరంగా అది రోషన్ కి బాగా ప్లస్ అయిందని చెప్పాలి. ఇక యాక్టింగ్ లోనూ తొలి సినిమా అన్నట్టు కాకుండా కామెడీ, ఎమోషన్ అన్నిటిలోనూ ఆరితేరిన వాడిలా నటించాడు. ఫస్ట్ సీన్ తోనే ఆడియన్స్ అటెన్షన్ డ్రా చేసిన రోషన్ ఇంటర్వెల్ సీన్ తో స్టార్ గా నిలదొక్కుకునేందుకు వచ్చానని చెప్పకనే చెప్పాడు. డైలాగ్ డెలివరీలో పర్ఫెక్ట్ టైమింగ్ మెయింటైన్ చేసి, డాన్స్ మూవ్స్ తోనూ యూత్ ని మెప్పించాడు. ఓవరాల్ గా యూత్ అండ్ మాస్ ఆడియన్స్ కి చేరువైన రోషన్ తొలి ప్రయత్నం ‘సుమా’రంభమే!

Read More: క్రష్ కోసమే టాటూ.. మరి శ్రద్ధ శ్రీనాథ్ క్రష్ ఎవరు?

ట్రెండింగ్ వార్తలు