పల్లవి ప్రశాంత్ తో బర్రెలక్క సీక్రెట్ మ్యారేజ్.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్?

January 31, 2024

పల్లవి ప్రశాంత్ తో బర్రెలక్క సీక్రెట్ మ్యారేజ్.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్?

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో పల్లవి ప్రశాంత్ ఒకరు. ఈయన ఒక రైతు బిడ్డగా కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. అయితే బిగ్ బాస్ కార్యక్రమంలో విన్నర్ గా నిలిచి బయటకు వచ్చారు. ఈ కార్యక్రమంలో విజేతగా నిలవడంతో ఈయనకు విపరీతమైనటువంటి ఫాన్ ఫాలోయింగ్ రావడమే కాకుండా సెలబ్రిటీ హోదా అందుకున్నారు.

ఇక పల్లవి ప్రశాంత్ తో పాటు ఇదే స్థాయిలో ఫేమస్ అయినటువంటి వారిలో బర్రెలక్క ఒకరు. ఈమె నిరుద్యోగిని అంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ఫేమస్ అయ్యారు. అయితే తెలంగాణ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి వార్తలలో నిలిచారు ఈమె గెలవకపోయినా అందరి అటెన్షన్ తనపై ఉండడంతో ఈమె కూడా సెలబ్రిటీ హోదా అందుకున్నారు.

ఇక పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఈమె తనను సపోర్ట్ చేస్తూ పలు వీడియోలను కూడా చేశారు. అయితే తాజాగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వీరిద్దరికి సంబంధించి ఒక క్రేజీ రూమర్ను వైరల్ చేస్తున్నారు. ప్రశాంత్ శిరీష ఇద్దరు కూడా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు అంటూ ఈ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ఇలా వీరిద్దరికి సంబంధించిన ఈ వార్తలు వైరల్ గా మారడంతో శిరీష ఈ వార్తలపై స్పందించారు. తాజాగా ఈమె మాట్లాడుతూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వారి వ్యూస్ పొందడం కోసం నేను పల్లవి ప్రశాంత్ ను రహస్యంగా పెళ్లి చేసుకున్నాను అంటూ వార్తలను పుట్టించారని, అయితే ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు. నేను పల్లవి ప్రశాంత్ అన్నను ఒక కామన్ మ్యాన్ గా రైతుబిడ్డగా భావించి తనని ఎంకరేజ్ చేస్తూ వీడియోలు చేశాను.

ఈ వీడియోలలో కూడా నేను తనని అన్న అంటూనే పిలుస్తున్నాను ఎక్కడైనా అన్నని పెళ్లి చేసుకుంటారా ఇదేనా మన సంస్కృతి అంటూ తన గురించి తప్పుడు వార్తలను సృష్టించిన వారికి ఈమె తన స్టైల్ లోనే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఇలా వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు అంటూ వస్తున్నటువంటి వార్తలపై బర్రెలక్క స్పందించడంతో ఈ వార్తలకు పుల్ స్టాప్ పడింది.

Read More: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ట్రెండింగ్ వార్తలు