September 5, 2023
Bigg Boss 7 Telugu Nominations: బిగ్‌బాస్ ఎపిసోడ్ వారాంతంలో ఎలా ఉన్నా సరే నామినేషన్స్ ప్రక్రియ రోజు మాత్రం రక్తి కట్టిస్తుంది. ఎందుకంటే ఒకరినొకరు కొట్టుకునేంతలా తిట్టుకుంటూ ఒకరిమీద ఒకరు వేసుకునే నిందలంటే చాలా మందికి ఇష్టం. కేవలం గొడవల కోసమే బిగ్‌బాస్ చూసేవాళ్లు లేకపోలేదు. అయితే ఈ సారి ఉల్టా-పల్టా కాబట్టి నామినేషన్స్ కూడా కొత్తగా ఉంటాయని ఎక్స్ పెక్ట్ చేశారు అందరూ. కానీ, ఎప్పటిలాగానే బిగ్ బాస్ ఒక్కో పార్టిసిపెంట్ ని పిలిచి యాక్టివిటీ రూమ్ లో నరకంలాగా ఒక సెట్ వేసి మరీ నామినేట్ చేయించాడు.
అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నామినేట్ అయిన వాళ్లు కన్ఫెషన్ రూమ్ లో నామినేషన్ చేసే ప్రోసెస్ ని చూశారు. అంతేకాదు, అక్కడ చెప్పిన రీజన్స్ ని కూడా వాళ్లు నోటీస్ చేసి తర్వాత వాళ్లని అడిగారు. ఇక్కడే బిగ్ బాస్ హౌస్ లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా ప్రియాంక కి రతిక ఇద్దరికీ చాలాసేపు ఆర్గ్యూమెంట్ జరిగింది. ఇక శోభాశెట్టి కూడా తనని నామినేట్ చేయడాన్ని తీసుకోలేకపోయింది.
షకీలా నామినేట్ చేయడాన్ని తప్పుబట్టాడు ప్రిన్స్ యవార్. తనది రీజనే కాదని చాలాసేపు వాదించాడు. ఇప్పటి వరకూ అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం హౌస్ మేట్స్ లో 8మంది నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో గౌతమ్ కృష్ణ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యవార్, షకీలా, కిరణ్ రాధోడ్ , శోభాశెట్టి, రతిక ఇంకా థామిని నామినేషన్స్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రియాంక జైన్ ని రతిక నామినేట్ చేసిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఈసారి ఫస్ట్ వీక్ కాబట్టి ఎలిమినేషన్స్ ఉండవని తెలుస్తోంది. దానికి సాక్ష్యమే రెండురోజుల పాటు నామినేషన్స్ ఉండడం. అంతేకాదు, బిగ్ బాస్ కేవలం హౌస్ లో ప్రవర్తన మాత్రమే కాకుండా బయట ఎలా ఉన్నారనేది కూడా రీజన్స్ చెప్పచ్చని చాలా క్లియర్ గా చెప్పాడు. కాబట్టి హౌస్ మేట్స్ మద్యలో మరింత అగ్గి రాజుకుంటోంది.
ఈ సారి ఎపిసోడ్ చూస్తుంటే కేవలం గొడవలు పెట్టుకుని ఫేమస్ అవ్వొచ్చని చాలా మంది కంటెస్టంట్లు హౌస్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తించాలి. బిగ్‌బాస్ లో ఫేమస్ అయిన వారిలో ఒకరిద్దరు మాత్రమే ప్రస్తుతం లైమ్ లైట్‌లో ఉన్నారు. బయటకు వచ్చాక బిగ్‌బాస్ వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరిగిందని ఆరోపించిన వాళ్లు లేకపోలేదు. ఇక హౌస్లో జరిగిన దాంట్లో వాళ్లకి కావాల్సినదే చూపించి తమను బ్యాడ్ చేశారని వాపోయినవారు ఉన్నారు. కాబట్టి అక్కడ ఫేమస్ అవడం కన్నా జనాల్లో అభిమానాన్ని సంపాదించుకుంటేనే బెటర్..చూద్దాం ఈ సారి ఏం జరుగుతుందో..
READ MORE: Bigg Boss Telugu6: ఈ సారి యూత్‌ని టార్గెట్ చేసిన బిగ్‌బాస్..అదిరిపోయే కంటెస్టెంట్‌లు