December 6, 2021
Bigg Boss 5 Telugu Priyanka Singh Remuneration: అందం, ఆటతీరుతో ఆకట్టుకున్న ప్రియాంక సింగ్..13వ వారంలో బిగ్‌బాస్ హౌస్ నుంచి భారంగా నిష్క్రమించింది. సాధారణంగా బిగ్‌బాస్ లోకి ఒకరు లేదా ఇద్దరు ట్రాన్స్‌జెండర్స్‌ను తీసుకోవడం కామన్.. అన్ని భాషల్లోనూ ఇది జరిగింది. గతేడాది కూడా తమన్నా సింహాద్రిని తీసుకున్నారు. రెండో వారమో మూడో వారమో వెళ్లిపోయింది అనుకోండి ఆ వివరాలు ఇక్కడ అనవసరం. అయితే మిగతా ట్రాన్స్‌జెండర్స్‌తో పోలిస్తే ప్రియాంక కాస్త ఎక్కువ రోజులు హౌస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తను ఏం చెప్పాలనుకుంటో ఖచ్చితంగా చెప్పగలగే ధైర్యం, టాస్కుల్లో బాగా ఆడడం ఆమెను ఇన్ని రోజులు కాపాడింది. అయితే మానస్ విషయంలో అతిగా ఆలోచించడం ఆమెకు శాపంగా మరింది. నిజానికి కాజల్‌తో పోలిస్తే అన్ని టాస్కుల్లో బానే పెర్‌ఫామ్ చేసింది. అయితే మానస్ వద్దంటున్నా తన వెంటేపడడం ఆడియన్స్‌కి చిరాకు తెప్పించింది. దాంతో ప్రియంక బిగ్‌బాస్ హౌస్‌ను వదలక తప్పలేదు.
బిగ్‌బాస్ ముందు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 10 వారాల వరకు 1.5 లక్షలు..ఆ తర్వాత వారానికి రెండు లక్షల చొప్పున ప్రియాంక సింగ్ కు ఇవ్వనున్నారు. ఈ లెక్కన పింకీకి 23 లక్షలు వస్తుంది. మధ్యల్లో టాస్కుల్లో భాగంగా మరో రెండు లక్షలు అదనం. అంటే పింకీ పాతిక లక్షలతో ఇంటినుండి బయటకు వచ్చింది. ఇప్పటి వరకూ బాగానే ఉన్నా…బిగ్‌బాస్ నుండి బయటకు వచ్చాక పింకీకి ఫేమ్ ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి మరి…
Read More: సమ్మర్ రేసులో రవితేజ…‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుదలయ్యేది ఎప్పుడంటే..?