శ్వేత‌కి రెడ్‌కార్డ్ ఇచ్చి డైరెక్ట్‌గా ఇంటికి పంపెయ్యాలి.. నాగార్జున‌కి నెటిజ‌న్ల రిక్వెస్ట్‌…

September 14, 2021

శ్వేత‌కి రెడ్‌కార్డ్ ఇచ్చి డైరెక్ట్‌గా ఇంటికి పంపెయ్యాలి.. నాగార్జున‌కి నెటిజ‌న్ల రిక్వెస్ట్‌…

సాధార‌ణంగా బిగ్‌బాస్ షోలో శ‌ని, ఆది వారాలు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కి కొద‌వ ఉండ‌దు అని అంటారు. ఆ రెండు రోజులు హోస్ట్ నాగార్జున కంటెస్టంట్స్‌తో వివిధ ర‌కాలు ఆట‌లు ఆడిపించి ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్టైన్ చేస్తాడు. కాని నిజ‌మైన బిగ్‌బాస్ ప్రేమికులు మాత్రం సొమ‌వారం ఎపిసోడ్‌ను అస్స‌లు మిస్ కారు. ఎందుకంటే ఆ రోజు నామినేషన్స్‌. కంటెస్టెంట్లు ఎంత కలిసిమెలిసి ఉన్నప్పటికి మండే వచ్చేసరికి మాత్రం నిజస్వరూపాలు బయటపడతాయి. వారి మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు కూడా విశ్వరూపం దాలుస్తాయి. కూల్‌ అనుకునేవారు కూడా కాళికా రూపం ఎత్తే అవకాశం ఉంటుంది. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది ఈ సోమ‌వారం నాటి ఎపిసోడ్‌.

బిగ్ బాస్ హౌస్ లో 2వ వారం నామినేషన్స్ నాటకీయంగా జరిగాయి. మిగ‌తా వారిగురించి ప్ర‌క్క‌న పెడితే
శ్వేత నామినేట్ చేసిన తీరు ఇప్పుడు ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. నామినేట్ చేయ‌డానికి వ‌స్తూనే ఫస్ట్ వస్తూనే ‘ఐ డోంట్ వాంట్ యువర్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ లోబో’ అంటూ లోబో క‌ట్టిన బ్యాండ్‌ను తీసి విసిరేసింది. అంత‌టితో ఆగ‌కుండా ఇక్కడ అందరూ ఫేక్ గేమ్ ఆడుతున్నారు అంటూ ఫేక్ అండ్ రియల్ గురించి చాలా ఎమోష‌న‌ల్‌గా మాట్లాడింది. నామినేష‌న్స్ అనే స‌రికి కంటెస్టంట్స్ ట్రూకలర్స్ నాకు చూపిస్తున్నారు అందరూ ఇక్కడ సేఫ్ గేమ్ ఆడద్దు అంటూ రెచ్చిపోయింది.

నేను ఫేక్ పీపుల్ ని డీల్ చేయలేను అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. నేను ఇండివెడ్యువల్ గా వచ్చాను అలాగే ఉంటాను. అంతేకాదు, నేను ఎక్కడా ఎవరి గురించి వాళ్లు లేనప్పుడు మాట్లాడలేదు అని గుర్తుచేసింది. స్ట్రయిట్ ఫార్వర్డ్ గా ఆవేశంగా స్పీచ్ ఇచ్చింది. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. ఉమాగారు ఆని మాస్ట‌ర్‌కి పెయింట్ పూసిన తీరు అస్సలు బాలేదని ఖారాఖండీగా తేల్చి చెప్పేసింది. మీరు ఆడ‌వారు నేను ఆడ‌దాన్ని ఆవిడ ఉమెన్ అంటూ ఉమెన్ కార్డ్ తీసింది. అలా ఎలా పూస్తారు ఆమెకి పెయింట్ అంటూ ఆవేశంగా విరుచుకుపడింది. మీలో హ్యుమానిటీ ఏది అని అడిగింది. ఇంత వ‌ర‌కూ షో చూస్తున్న స‌గ‌టు ప్రేక్ష‌కుడికి శ్వేత నిజ‌మే చెప్తుంది అనే ఫీలింగ్ క‌లిగింది. అయితే ఆ త‌ర్వాత ఆమె చేసిన ప‌ని ఈ రోజు నెటిజ‌న్స్ ఆమెను విప‌రీతంగా ట్రోల్ చేసేలా చేసింది.

ఇద్దరిని నామినేట్ చేయాలి అంటే నాకు ఇది చాలా టఫ్ అని ఎంతో బాధగా పెయిన్ గా ఉంటుందని చెప్తూనే లోబోని హమీదాని నామినేట్ చేస్తూ రీజన్స్ చెప్పింది. బుల్ షిట్ ఆల్ బుల్ షిట్ పీపుల్ స్టే ఎవే ఫ్రమ్ మీ. అని మాట్లాడుతూ ఆవేశంతో వెళ్లి.. హమీద ముఖంపై గట్టిగా పెయింట్ కొట్టింది.

ఇక్కడ తను చెప్పిన మాటలకి చేష్టలకి అస్సలు సంబంధమే లేకుండా పోయింది. అప్పటివరకూ స్పీచ్ లో నిజాయితీ ఉన్నది అనుకున్నా కూడా శ్వేత చేసిన చర్యలు అక్కడ ఉన్న‌వారితో పాటు షో చూస్తున్న అందర్నీ ఆశ్చర్యపరిచాయి. శ్వేతా వద్దు అని ఆనీ మాస్ట‌ర్ చెప్తున్నా కూడా వినకుండా అదే ఫోర్స్ తో వెళ్లి లోబోకి పెయింట్ కొట్టేసింది. వారిద్ద‌రి క‌ళ్ల‌లో పెయింట్‌ప‌డి మంట‌తో విల‌విల‌లాడుతుంటే ఐ డోంట్ కేర్ అంటూ రాయిలాగా నుంచుంది.

నిజానికి ఉమాదేవి అంత అవేశంగా ఉన్న‌ప్ప‌టికీ అనీమాస్టర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఆమె క‌ళ్ళ‌లో పెయింట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా మొహం మీద‌నే పూసింది. అయితే శ్వేత దానికి విరుద్దంగా హమిద, లోబో మొహంపై పెయింట్ బ‌లంగా కొట్టింది. దాంతో లోబో సంగ‌తి వదిలై హ‌మిద కూడా నీ లాగా ఉమ‌న్ క‌దా హ్యూమానిటీ, ఉమెన్ స‌పోర్ట్‌పై నువ్వు ఇంత వ‌ర‌కూ ఇచ్చిన స్పీచ్‌కు ఇంక అర్ధం ఏముంది? ఆవేశంతో నువ్వు చేసిన ఈ ప‌నికి హమీద లేదా లోబో కళ్లు డ్యామేజ్ అయి ఉంటే నువ్వు ఇస్తావా? అంటూ బిగ్ బాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు శ్వేత‌కు బిగ్‌బాస్ హౌస్లో కొన‌సాగే అర్హ‌త లేద‌ని డైరెక్ట్‌గా రెడ్ కార్డ్ ఇచ్చి ఇంటికి పంపేయ్యాల‌ని నాగార్జునని ట్యాగ్ చేసి మ‌రీ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ త‌ర్వాత త‌ప్పు తెలుసుకుని శ్వేత మొకాళ్ల‌పై కూర్చొని క్ష‌మాప‌న‌లు చెప్పినా దాని వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగం లేకుండా పోయింది. మ‌రి చూడాలి ఈ విష‌యంపై నాగార్జున ఎంత సీరియ‌స్ అవుతారు అనేది ఈ శ‌నివారం చూడాలి..

ట్రెండింగ్ వార్తలు