September 5, 2022
ఇప్పటివరకూ ఐదు సీజన్లు పూర్తిచేసుకున్న బిగ్‌బాస్ ఆరో సీజన్ మొదలైంది. గత మూడు సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున ఈ సారి మరింత వినోదం పంచనున్నారు. మొత్తం 15వారాల పాటు జరగనున్న ఈ షోలో 21మంది కంటెస్టంట్లు అదిరిపోయే ఎంట్రీలతో ఆకట్టుకున్నారు. ఈ సారి బిగ్‌బాస్ పూర్తిగా యూత్ ఆడియన్స్‌ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఎక్కువగా యూట్యూబర్స్, కమెడియన్స్, సీరియల్ ఆర్టిస్టులు ఈ సీజన్‌లో సందడి చేయనున్నారు. గత సీజన్లతో పోలిస్తే ఈ సారి బిగ్‌బాస్ హౌస్ మరింత అందమైన అమ్మాయిలతో యూత్ ని అలరించనుంది. మరి ఆలస్యం ఎందుకు బిగ్‌బాస్ కంటెస్టంట్స్ లీస్ట్, వాళ్ల బ్యాక్‌గ్రౌండ్ ఏంటో ఓ లుక్కేయండి..1. కార్తికదీపం మొదలైనప్పటి నుండి ప్రతి సీజన్‌లోనూ ఎవరో ఒకరు ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. ఫస్ట్ కంటెస్టెంట్‌గా కార్తీకదీపం, మనసిచ్చి చూడు ఫేమ్ కీర్తి భట్ స్పెషల్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చింది.
2. రెండో కంటెస్టెంట్‌గా నువ్వునాకు నచ్చావు సినిమాలో పింకీ అలియాస్ సుదీప ఎంట్రీ ఇచ్చింది.3. మూడో కంటెస్టెంట్‌గా సిరి ప్రియుడు శ్రీహాన్ ఎంట్రీ ఇచ్చాడు. గత సీజన్లో సిరీకోసం ఈ షోకి వచ్చాడు శ్రీహాన్, అప్పటినుండి నెక్ట్స్ సీజన్లో తప్పక కనిపిస్తాడు అనే టాక్ నడిచింది. అదే నిజమైంది4. నాలుగో కంటెస్టెంట్‌గా యాంకర్ నేహా చౌదరి ఎంట్రీ ఇచ్చింది. రారా రక్కమ్మా సాంగ్‌తో స్టేజ్‌ని షేక్ చేసింది ఈ యాంకర్ పాప.5. ఐదో కంటెస్టెంట్‌గా జబర్దస్త్ చలాకీ చంటి ఎంట్రీ ఇచ్చాడు. చిన్న తనంలోనే వదిలేసి వెళ్లిపోయిన తన తండ్రి గురించి చెప్పి ఎమోషనల్ అయ్యాడు చంటి. బింబిసార మాదిరిగా చంటిసార అంటూ అలరించాడు.6. ఆరో కంటెస్టెంట్‌గా సీరియల్ నటి శ్రీ సత్య ఎంట్రీ ఇచ్చింది. డాన్స్ పెర్ఫామెన్స్‌తో స్టేజ్‌ని షేక్ చేసింది ఈ బుల్లితెర బ్యూటీ.7. ఏడో కంటెస్టెంట్‌గా హీరో అర్జున్ కళ్యాణ్ – (Arjun Kalyan) ఎంట్రీ ఇచ్చాడు. డాన్స్ పెర్ఫామెన్స్‌తో అలరించాడు అర్జున్.8. ఎనిమిదో కంటెస్టెంట్‌గా గీతూ రాయల్ అలియాస్ గలాటా గీతు స్టేజ్ మీదికి ఎంట్రీ ఇచ్చింది మొదలు.. వాగుతూనే ఉంది.9. తొమ్మిదో కంటెస్టెంట్‌గా అభినయ శ్రీ ఎంట్రీ ఇచ్చింది. తన పాపులర్ సాంగ్ ‘అ అంటే అమలాపురం’ సాంగ్‌కి అదిరిపోయే స్టెప్‌లు వేసి స్టేజ్‌ని షేక్ చేసింది.10, 11 కంటెస్టెంట్స్ గా రియల్ లైఫ్ కపుల్ రోహిత్- మెరీనా జంట బ్యూటిఫుల్ సాంగ్ పెర్ఫామెన్స్‌తో ఎంట్రీ ఇచ్చారు.12వ కంటెస్టెంట్‌గా నటుడు బాలాదిత్య అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. ఓ స్పెషల్ వీడియోతో తన గురించి తాను పరిచయం చేసుకున్నాడు.13వ కంటెస్టెంట్‌గా బ్యూటిఫుల్ లేడీ వాసంతి కృష్ణన్ (Vasanthi Krishnan) ఎంట్రీ ఇచ్చింది. మాస్ మసాలా పాటతో అల్లాడించింది. వాసంతి కృష్ణన్ అంటే పెళ్లైందని అనుకుంటారని.. అయితే తనకి ఇంకా పెళ్లి కాలేదని చెప్పింది వాసంతి.14వ కంటెస్టెంట్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ షానీ అలియాస్ సాల్మన్ (Shani Salmon) ఎంట్రీ ఇచ్చాడు. ఓ స్పెషల్ వీడియోతో తన గురించి గాను చెప్పుకుంటూ తనకి ఐదుగురు గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్పాడు షానీ. ఆ ఐదుగురి గర్ల్ ఫ్రెండ్స్‌కి గుర్తుగా ఐదు అక్షరాలతో shani అని పేరు పెట్టుకున్నట్టు చెప్పాడు షానీ సల్మాన్. అందరూ తనని షానీ అనే పిలుస్తారని చెప్పాడు.15వ కంటెస్టెంట్‌గా ఆర్జీవీ హీరోయిన్ ఇనయ సుల్తాన-(Inaya Sultana) ఊ అంటావా? మామా ఉఊ అంటావా అంటూ హాట్ పెర్ఫామెన్స్‌తో అల్లాడించింది. వర్మ వీడియోతో పాపులర్ అయిన ఈ భామను ఆ వీడియో గురించి అడిగారు నాగార్జున. నెగిటివ్ అయ్యింది కానీ.. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా పబ్లిసిటీ ఉండాల్సిందే అని చెప్పింది ఇనయ సుల్తాన.16వ కంటెస్టెంట్‌గా ఆర్జే సూర్య ఎంట్రీ ఇచ్చాడు. పవర్ స్టార్ సాంగ్‌తో పాటు.. అతని వాయిస్‌ని ఇమిటేట్ చేస్తూ తన మల్టీటాలెంట్ చూపించాడు.17వ కంటెస్టెంట్‌గా జబర్దస్త్ ఫైమా (jabardasth Faima) ఎంట్రీ ఇచ్చింది. తాను లైఫ్‌లో ఎదుర్కొన్న ఇబ్బందుల్ని కళ్లకి కడుతూ స్పెషల్ వీడియోలో తన బాధ చెప్పుకుంది ఫైమా.18వ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. యూట్యూబర్ ఆదిరెడ్డి. ఓ స్పెషల్ వీడియోతో తన గురించి తాను పరిచయం చేసుకున్నాడు ఆదిరెడ్డి.19 కంటెస్టెంట్‌గా మోడల్ రాజశేఖర్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు.20వ కంటెస్టెంట్‌గా టీవీ 9 యాంకర్ ఆరోహి రావ్ అలియాస్ ఇస్మార్ట్ అంజలి హౌస్‌లోకి అడుగుపెట్టింది21వ కంటెస్టెంట్.. చివరి కంటెస్టెంట్‌గా సింగర్ రేవంత్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. స్టేజ్‌పై తన వాయిస్‌తో మెస్మరైజ్ చేశాడు. నిండు గర్భిణిగా ఉన్న రేవంత్ భార్య.. బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చి ఆల్ దిబెస్ట్ చెప్పి మరీ హౌస్‌లోకి పంపించింది.