బిగ్‌ బాస్ తెలుగు7: హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన 14 మంది కంటెస్టంట్లు వివ‌రాలు..

September 4, 2023

బిగ్‌ బాస్ తెలుగు7: హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన 14 మంది కంటెస్టంట్లు వివ‌రాలు..

తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఆరు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని 7వ సీజ‌న్‌లోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 3న ఏడో సీజన్ షురూ అయ్యింది. ఈ ఏడో సీజన్‌కు కూడా నాగర్జునే హోస్ట్‌గా చేస్తున్నారు. ఈ సీజన్‌ గతంలో మాదిరిగా ఉండదని.. ఈ సీజన్ అంతా ఉల్టా పుల్టాగా ఉంటుందని మొదటి నుంచి చెబుతోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఓటింగ్‌లో కూడా ఓ కొత్త మార్పును తీసుకువచ్చింది బిగ్ బాస్ యాజమాన్యం. గత ఆరు సీజన్లలో ప్రేక్షకులు 10 ఓట్లు వేసే అవకాశం ఇచ్చారు. ఈ పది ఓట్లు ఒక కంటెస్టెంట్‍కు మాత్రమే వేయకుండా నచ్చిన వారందరికీ వేసే అవకాశం ఉండేది. వీటికితోడు 10 మిస్డ్ కాల్స్‌తో కూడా నచ్చిన విధంగా ఓటే వేసే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఆ విధానాన్ని బిగ్ బాస్ మేకర్స్ పూర్తిగా మార్చేశారు. ఈ సీజన్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు ఒక ప్రేక్షకుడు ఒక్క ఓటు మాత్రమే వేయగలడు. ఇంట్లో తనకు నచ్చిన ఒకే ఒక్క సభ్యుడికి మాత్రమే ఓటు వేయాలి. హాట్ స్టార్ యాప్ నుంచే మాత్రమే ఈ ఓటు వేయాల్సి ఉంటుంది. ఇక మిస్ట్ కాల్ కూడా ఒకటి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది.

ఇక బిగ్ బాస్ హౌజ్‌లో వరుసగా 14 మంది ఎంట్రీ ఇచ్చారు. వారి వివరాలు ఏంటో చూద్దాం..

ప్రియాంక జైన్‌ | ప్రియాంక తెలుగులో కొన్ని సినిమాలతో పాటు మౌనరాగం అనే సీరియల్‌లో నటించింది. ముంబైలో పుట్టి పెరిగిన ఈ మరాఠి అమ్మాయి.. ఇప్పుడు ఓ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆమె తెలుగులో ‘వినరా సోదరా వీర కుమార’, ‘చల్తే చల్తే’, ‘ఎవడూ తక్కువ కాదు’ వంటి సినిమాల్లో నటించింది.

PRIYANKA JAIN

శివాజీ | నటుడు శివాజీ గతంలో పలు బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోగా చేశాడు. ఇప్ప‌టికే 96 సినిమాలు పూర్త‌య్యాయ‌ని శివాజీ ఈ షోలో చెప్పారు. ముఖ్యంగా మిస్సమ్మ, మంత్ర వంటి చిత్రాల్లో తన నటనతో వావ్ అనిపించాడు. అయితే ప్రస్తుతం శివాజీ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఆయన చివ‌ర‌గా ‘గ్యాంగ్‌స్టర్స్‌’ అనే వెబ్‌సిరీస్‌తో నటించాడు.

SIVAJI

దామిని భట్ల | దామిని తెలుగులో పలు సినిమాల్లో పాటలు పాడి పాపులర్ అయ్యింది. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో ‘పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో’, పాటతో అదరగొట్టింది. ఇక లేటెస్ట్‌గా ఆమె పాడిన పాట ‘ధమ్‌ ధమ్‌’ కొండపొలం సినిమాలోని పాటకు చంద్రబోస్‌కు ఉత్తమ గీత రచయితగా జాతీయ పురస్కారం వచ్చింది.

DAMINI

ప్రిన్స్‌ యవార్‌ | యవార్ పలు సీరియల్స్‌లో నటించి పాపులర్ అయ్యాడు. అంతేకాదు యావర్ మోడల్‌‌గాను రాణిస్తున్నాడు. ఇతను 12 జూన్ 1996న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జన్మించాడు. యావర్ తెలుగులో నా పేరు మీనాక్షి సీరియల్‌‌తో పాటు హిట్లర్ గారి పెళ్లాం, అభిషేకం వంటి సీరియల్స్‌లో నటించి మెప్పించాడు.

PRINCE YAWAR

శుభశ్రీ | శుభశ్రీ నటి మాత్రమే కాదు. ఆమె ఓ లాయర్ కూడా.. ఇక తెలుగులో 2002లో వచ్చిన ‘రుద్రవీణ’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒడిశాలో పుట్టి, పెరిగిన కాలేజీ రోజుల్లో మోడలింగ్‌ చేస్తూ.. ఫెమినా మిస్‌ ఇండియా 2020’ కిరీటం దక్కించుకుంది.

SUBHA SHREE

షకీలా | షకీలా తెలుగులో పాపులర్ నటి. ఆమె ఒకప్పుడు తెలుగుతో పాటు మలయాళ చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. అయితే ఆమె ఓ శృంగార తారగానే ఎక్కువ మందికి తెలుసు. అయితే ఆమెలో మరోకోణం ఈ షో తో చెప్పాలనీ వచ్చినట్లు పేర్కోన్నారు.

SHAKILA

సందీప్‌ | ఆట సందీప్‌గా పాపులర్ కొరియోగ్రాఫర్ బిగ్ బాస్ 7లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన డాన్స్‌లతో, స్టైలీష్ స్టె్ప్స్‌తో అలరించిన సందీప్ షోలో ఎలా రాణిస్తాడో చూడాలి.

SANDEEP

శోభాశెట్టి | తెలుగు పాపులర్ సీరియల్ ‘కార్తీక దీపం’లో మోనిత క్యారెక్టర్‌లో నటించి అదరగొట్టిన నటి శోభా శెట్టి. ఆ సిరీయల్‌లో నెగిటివ్ పాత్రలో నటించి మెప్పించింది.

SHOBHA SHETTY

టేస్టీ తేజ | యూట్యూబ్‌లో ఫుడ్ వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో కంటెస్టెంట్ టేస్టీ తేజ.

TASTY TEJA

రతిక | బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మరో హీరోయిన్ రతిక. ఈ భామ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే అనుకున్న రేంజ్‌లో మాత్రం గుర్తింపు రాలేదట. అందుకే బిగ్ బాస్‌కు వచ్చినట్లు పేర్కోంది.

RATHIKA

గౌతమ్‌ కృష్ణ | డాక్టర్ గౌతమ్‌ కృష్ణ.. ఓ వైపు వైద్యం చేస్తూనే.. మరోవైపు నటనపై మక్కువతో ఇటువైపు వచ్చానని తెలిపాడు.

GOUTHAM KRISHNA

కిరణ్‌ రాథోడ్‌ | ఒకప్పుడు హీరోయిన్‌గా రాణించిన కిరణ్ రాథోడ్.. లేటెస్ట్‌గా బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టి ఆశ్చర్యపరిచారు. ఆమె నటిగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు.

KIRAN RATHORE

పల్లవి ప్రశాంత్‌ | సాధారణ రైతు కుంటుంబం నుంచి బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. మా ఊర్లో బిగ్‌బాస్‌కు వెళ్తానంటే అందరూ నవ్వారని.. అయితే పట్టు వదలకుండా యూట్యూబ్‌లో వీడియోలు చేయడంతో ఈ అవకాశం వచ్చిందని చెప్పాడు. ఇక ప్రశాంత్‌కు స్టేజీపై నాగార్జున ఒక మిర్చి మొక్కను గిఫ్ట్‌గా ఇచ్చారు. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనీ సూచించారు.

PALLAVI PRASHANTH

అమర్‌దీప్‌ | ఇక చివరగా ఈ బిగ్ బాస్ 7 సీజన్‌లో ఎంట్రీ ఇచ్చాడు నటుడు అమర్‌దీప్. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగు పెట్టిన తాను ప్రతి గేమ్‌లోనూ తన సత్తాను చాటుతానని తెలిపాడు.

AMARDEEP

Read More: ఓజి గ్లింప్స్: ప‌వ‌న్ బ‌ర్త్ డే కి ప‌ర్‌ఫెక్ట్ గిఫ్ట్‌

ట్రెండింగ్ వార్తలు