September 2, 2023
పదేళ్లుగా పవన్ కళ్యాణ్ నుండి సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. గతంలో గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత పవన్ నుండి ఆ స్థాయి హిట్స్ రాలేదు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్,బ్రో సినిమాలు పవన్ ఫ్యాన్స్ కి నచ్చుతున్నా..బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొట్టడం లేదు. దాంతో అభిమానులు నిరాశతోనే ఎదురుచూడాల్సి వస్తుంది.
కొత్త సబ్జెక్టులతో రిస్క్ ఎక్కువని, తక్కువ రోజులలో షూటింగ్ పూర్తిచేయొచ్చన్న ఆలోచనలతో పరభాషా చిత్రాలను రీమేక్స్ చేస్తూ వస్తున్నారు పవన్. దీంతో రీమేక్స్ కాకుండా కొత్త సబ్జెక్టుతో సినిమాలు కావాలని ఫ్యాన్స్ గగ్గోలుపెడుతున్నారు. కాగా.. ఇప్పుడు, హరి హర వీరమళ్లు, ఓజీ ఒరిజినల్ కథలతోనే తెరకెక్కుతున్నాయి. అయితే క్రిష్ దర్శకత్వం వహిస్తున్న హరి హర వీర మళ్లు బడ్జెట్, క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆగిపోలేదు.. అలాగని ముందుకు సాగడం లేదు. దాంతో `సాహో` ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో మాఫియా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్నఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు పీక్స్ లో చేరుకున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా OG నుండి గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఓజి గ్లింప్స్ పూర్తి స్థాయిలో ఫుల్ ఆన్ ఫైర్ లో సాగింది. పవన్ కళ్యాణ్ లుక్, మేనరిజం.. గన్స్.. రక్తపాతం.. బ్యాక్ గ్రౌండ్ లో అర్జున్ దాస్ బేస్ వాయిస్ అన్ని కూడా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇక ఎండింగ్ లో పవన్ పోలీస్ స్టేషన్ లో మరాఠీ మాట్లాడటం.. కొత్తగా అనిపిస్తుంది. గ్లింప్స్ ప్రకారం.. ఓజి మూవీ ముంబై నేపథ్యంలో సాగనుందని అర్ధమవుతుంది. బ్యాక్ గ్రౌండ్ లో చెప్పిన వాయిస్ తో పాటు సినిమాటోగ్రఫీ.. పవన్ ని నెక్స్ట్ లెవెల్ లో ప్రెజెంట్ చేశాయి. అందుకు తగ్గ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టాడు తమన్.
రీమేక్స్, హరిహర వీరమల్లు కాకుండా పవన్ ఎంచుకున్న పక్కా ఫ్రెష్ కమర్షియల్ సబ్జెక్టు ఇది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఓజి పైనే పడింది. ముందునుండి దర్శకుడు సుజిత్ పై ఫ్యాన్స్ లో పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. అయితే.. తాజాగా విడుదలైన ఓజి గ్లింప్స్ చూసాక.. ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.
Read More: ఖుషి ఫస్ట్ డే కలెక్షన్: మైత్రి వాళ్లు చెబుతున్నది ఎంత? అసలు వచ్చింది ఎంత?