కొత్త రికార్డులు సృష్టిస్తున్న బింబిసార…అదిరిపోయే కలెక్షన్స్‌

August 9, 2022

కొత్త రికార్డులు సృష్టిస్తున్న బింబిసార…అదిరిపోయే కలెక్షన్స్‌
రీసెంట్‌ టైమ్స్‌లో టాలీవుడ్‌లో హిట్‌ మూవీస్ క‌రువైపోయాయి. అలాంటి సమయంలో విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకున్న సినిమా ‘బింబిసార’. కళ్యాణ్‌రామ్‌ హీరోగా వశిష్ట్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు దాదాపు 40 కోట్లు ఖర్చు పెట్టారు (ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వశిష్ట్‌ చెప్పుకొచ్చారు). నాన్‌ థియేట్రికల్‌ రైట్స్‌ దాదాపు 28 కోట్లకు అమ్ముడు పోయాయని సమాచారం.ఇక థియేట్రికల్‌గా 17 కోట్లకు అమ్ముకున్నారట కళ్యాణ్‌రామ్‌. అయితే థియేటర్స్‌లో రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారధం పడుతున్నారు. రిలీజైన నాలుగు రోజుల్లోనే ఈ సినిమా దాదాపు 20 కోట్ల షేర్‌ను సంపాదించుకుంది. మొత్తం 34 కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టింది. ఇంకా ఈ సినిమా థియేటర్స్‌లోనే ఉంది. మంచి టాక్‌తో ఉన్నఈ సినిమాకు ఇంకా ప్రేక్షకుల ఆదరణ లభిస్తే..బింబిసార యాభై కోట్ల మైలురాయికి చేరిపోతాడు. అలాగే ఈ చిత్రం కళ్యాణ్‌రామ్‌ కెరీర్‌లో హాయ్యెస్ట్‌ గ్రాసర్‌ ఫిల్మ్‌గా నిలుస్తుందనడంలో ఏ సందేహాం లేదు.

ట్రెండింగ్ వార్తలు