మెగాస్టార్‌ ట్యాగ్‌…కొట్టుకుంటున్న‌ మెగా, నందమూరి ఫ్యాన్స్‌!

August 9, 2022

మెగాస్టార్‌ ట్యాగ్‌…కొట్టుకుంటున్న‌ మెగా, నందమూరి ఫ్యాన్స్‌!

అల్లు అర్జున్‌ ఫాదర్‌ అల్లు అరవింద్ నేతృత్వంలోని ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ‘సామ్‌ జామ్‌’ అనే టాక్‌ షో వచ్చింది. ఈ షోకు సమంత హోస్ట్‌గా వ్యవహరించారు. బడా బడా సెలబ్రీటీలు వ‌చ్చినా కాని ఎందుకో కానీ ఈ షో అంత పాపులారిటీని దక్కించుకోలేకపోయింది. దానికి స‌మంత హోస్టింగ్ కూడా ఓ కార‌ణం. స‌రే ఈ విషయాన్ని పక్కన పెడితే.. ‘సామ్‌ జామ్‌’ ఫైనల్‌ టాక్‌ షోకు అల్లు అర్జున్‌ గెస్ట్‌గా వచ్చాడు. అయితే ఈ ఎపిసోడ్‌ ప్రొమోలో మెగాస్టార్ అల్లు అర్జున్‌ అని ట్యాగ్‌వేశారు. దీనిపై మెగా ఫ్యా న్స్ సోషల్‌మీడియా వేదికగా ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఈ వేడి దెబ్బకు ఆహా నేలకు దిగి వచ్చింది. దెబ్బకు ఓ క్షమాపణ నోట్‌తో మెగాస్టార్‌ ట్యాగ్‌ను వెనక్కి తీసుకుంది. అయితే మెగాఫ్యాన్స్ మ‌రియు మెగాఫ్యాన్స్‌లోనే ఉన్న అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ల మధ్య ఈ విషయంలో బాగానే వార్‌ జరిగింది. క‌ట్‌చేస్తే…

నందమూరి హీరో కళ్యాణ్‌రామ్‌ ‘బింబిసార’ చిత్రం ఈ నెల 5న విడుదలై మంచి పాజిటివ్‌టాక్‌ తెచ్చుకుంటుంది. కళ్యాణ్‌రామ్‌ కెరీర్‌లోనే ఈ సినిమా హాయ్యెస్ట్‌ గ్రాసర్‌గా నిలిచే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా టైటిల్‌ కార్డ్స్‌లో మెగాస్టార్‌ కళ్యాణ్‌రామ్‌ అనే పేరు వేశారు. దీంతో మెగాఫ్యాన్స్‌ అందరూ సోషల్‌మీడియా వేదికగా అభ్యంతరం తెలిపారు. ఇటు నందమూరి ఫ్యాన్స్‌ కూడా ఏ మాత్రం తగ్గలేదు. ఈ విషయం ఇటు చిరంజీవి, అటు కళ్యాణ్‌రామ్‌ల వరకు చేరింది. ఇంకా ముదిరితే బాగోదని ఈ విషయంలో కళ్యాణ్‌రామ్‌ కాస్త వెనక్కు తగ్గాలని నిర్ణయించుకున్నారట. కానీ నందమూరి ఫ్యాన్స్‌ ఎలా రెస్పాండ్‌ అవుతారా? అనే ఆలోచన అయితే చేస్తున్నారు. పోనీ నెక్ట్స్‌ ఫిల్మ్‌ నుంచి స్టార్‌ అనే ట్యాగ్‌ లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? అనే థాట్స్‌ కూడా ఉన్నాయట కళ్యాణ్‌రామ్‌కు.

ట్రెండింగ్ వార్తలు