August 29, 2022
బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా ఎప్పటికప్పుడు కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గతంలోనే ‘మనుచరిత్ర’ సినిమా చేశారు. ఇప్పుడు సర్వైవల్ థ్రిల్లర్ ‘బ్రేక్ అవుట్’ సినిమా చేశారు. సుబ్బు చెరుకూరి దర్శకత్వంలో అనిల్ మోదుగ నిర్మించారు. బాలకృష్ణ కొండూరి, శ్రీనివాస్ వన్నియాకుల ఈ సినిమాకు సహ నిర్మాతలు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను హీరో అల్లు అర్జున్ రిలీజ్ చేశారు.
మోనో ఫోబియాతో బాధపడే ఓ యవకుడి కథలా ఈ సినిమా ఉండబోతుంది. చిత్రం శీను, కీరిటి, బాల కామేశ్వరి, ఆనంద చక్రపాణి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా రిలీజ్‌పై త్వరలో ఓ స్పష్టత రానుంది.