పేపర్ లో పవన్ ఫొటో చూసి అలాంటి కామెంట్స్ చేసిన రజినీకాంత్.. ఆశ్చర్యపోయిన సునీల్?

April 12, 2024

పేపర్ లో పవన్ ఫొటో చూసి అలాంటి కామెంట్స్ చేసిన రజినీకాంత్.. ఆశ్చర్యపోయిన సునీల్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. మొన్నటి వరకు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిస్థాయిలో ఎన్నికలపై దృష్టి పెట్టారు. పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం హరిహర వీరమల్లు,ఓజి,ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలకు సంబంధించిన షూటింగ్ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. బహుశా ఎన్నికల తర్వాత ఆ చిత్రాల షూటింగ్స్ తిరిగి ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది. ఇకపోతే కమెడియన్ సునీల్ గురించి మనందరికీ తెలిసిందే.

ప్రస్తుతం కామెడీ పాత్రలతో పాటు విలన్ పాత్రల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు సునీల్. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా సునీల్ కి మంచి సాన్నిహిత్యం ఉందన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఆమధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీల్ పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సునీల్.. సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలసి కథానాయకుడు చిత్రంలో నటిస్తుండగా జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చారు సునీల్. సెట్స్ లో ఉండగా న్యూస్ పేపర్ లో జల్సా చిత్రం గురించి ఆర్టికల్ వచ్చిందట. వెంటనే సునీల్ ఆ పేపర్ తీసుకువెళ్లి రజనీకాంత్ కి చూపించారట.

ఈ మూవీ డైరెక్టర్ నా బెస్ట్ ఫ్రెండ్ సర్ అని సునీల్ చెప్పగా, రజనీకాంత్ వెంటనే ఆ తెలుసండి. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తెలుసు అని చెప్పారట. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఫోటో చూసి రజనీకాంత్ చెప్పిన మాటకి సునీల్ ఆశ్చర్యపోయాడట. తెలుగులో నెక్స్ట్ సూపర్ స్టార్ ఇతనే అండీ అని అన్నారట. ఒక మనిషి గురించి అంతగా తెలియకుండా ఎలా చెప్పగలరు అని అనుకున్నాను అని తెలిపారు సునీల్. ఇక ఆ రోజు రజినీకాంత్ చెప్పిన విధంగానే పవన్ కళ్యాణ్ నేడు స్టార్ హీరోలలో ఒకరిగా రాణిస్తున్నారు.

https://telugu.chitraseema.org/versatile-actor-sayaji-shinde-hospitalized-due-to-heart-attack/ ,

ట్రెండింగ్ వార్తలు