హాస్పిటల్ పాలైన నటుడు సాయాజీ షిండే.. ఆస్పత్రిలో బెడ్ పై అలా?

April 12, 2024

హాస్పిటల్ పాలైన నటుడు సాయాజీ షిండే.. ఆస్పత్రిలో బెడ్ పై అలా?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయాజీ షిండే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నెగిటివ్ పాత్రలో మాత్రమే కాకుండా పాజిటివ్ పాత్రలలో కూడా నటించి మెప్పించారు. ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో ఆయన సినిమాలు చేయడం చాలా వరకు తగ్గించేశారు. ఇకపోతే తాజాగా ఆయనకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలేం జరిగిందంటే.. సాయాజీ షిండే ఆస్పత్రిలో చేరారు.

ఆయ‌న‌కు ఛాతీలో నొప్పి రావ‌డంతో మ‌హారాష్ట్ర‌లోని స‌తారాలోని ఒక ప్రైవేటు ఆస్ప‌త్రికి కుటుంబ స‌భ్యులు తీసుకువెళ్లారు. ప‌రీక్షించిన వైద్యులు ఆయ‌న గుండెలో కొన్ని బ్లాక్స్ ఉన్న‌ట్లు గుర్తించారు. వెంట‌నే యాంజియో ప్లాస్టీ చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. అయితే గ‌త కొద్ది రోజులుగా సాయాజీ షిండే అనారోగ్యంతో బాధప‌డుతున్నారు. అయితే తాజాగా హాస్పిటల్ కి వెళ్ళగా చెక‌ప్‌లో భాగంగా కొన్ని ప‌రీక్ష‌లు చేయ‌గా గుండెలో స‌మ‌స్య ఉన్న‌ట్లు తెలిసింది. గుండెలో కుడివైపు 99 శాతం బ్లాక్స్‌ను గుర్తించారు వైద్యులు.

యాంజియోగ్ర‌ఫీ చేయాల‌ని సూచించడంతో వెంటనే ఆయ‌న త‌న షూటింగ్స్ అన్ని క్యాన్సిల్స్ చేసుకుని చికిత్స కోసం ఆస్ప‌త్రిలో చేశారట. అయితే విజ‌య‌వంతంగా స‌ర్జ‌రీ పూర్తి అయినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంది. త్వ‌ర‌లోనే డిశ్చార్జ్ చేస్తాము అని వైద్యులు తెలిపారు. దీంతో అసలు విషయం తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.. అయితే ప్రస్తుతం ఆయన హాస్పిటల్ బెడ్ పై ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

https://telugu.chitraseema.org/if-bunny-cant-do-that-wearing-a-saree-that-itself-highlight-of-movie-%e0%b0%9a%e0%b1%80%e0%b0%b0-%e0%b0%95%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%95%e0%b1%8a%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%86/

ట్రెండింగ్ వార్తలు