కల్ట్ టైటిల్ వివాదం.. విశ్వక్ సేన్ అల.. ఎస్ కే ఎన్ ఇలా

December 31, 2023

కల్ట్ టైటిల్ వివాదం.. విశ్వక్ సేన్ అల.. ఎస్ కే ఎన్ ఇలా

Cult Title Controversy: సాధారణంగా ఒక సినిమాకి ఏదైనా టైటిల్ అనౌన్స్ చేయాలి అంటే ముందుగా ఆ టైటిల్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా రిజిస్టర్ చేసుకున్నటువంటి వారే ఆ టైటిల్ వారి సినిమాలకు పెట్టుకునే అవకాశం ఉంటుంది అయితే కొంతమంది టైటిల్ రిజిస్టర్ చేయకుండా వారి సినిమాలకు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు తద్వారా ఎన్నో గొడవలు వివాదాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి ప్రస్తుతం ఇలాంటి గొడవ బేబీ నిర్మాత ఎస్ కే ఎన్ నటుడు విశ్వక్ మధ్య జరుగుతోందని చెప్పాలి. వీరిద్దరూ కూడా కల్ట్ టైటిల్ కోసం భారీ స్థాయిలో గొడవ పడుతున్నారు.

బేబీ నిర్మాత తన సినిమాకు కల్ట్ బొమ్మ అని టైటిల్ రిజిస్టర్ చేసుకున్నారని తెలుస్తుంది. అయితే విశ్వక్ నటించబోయే సినిమాకి కూడా కల్ట్ అనే టైటిల్ పెట్టబోతున్నారని విషయం తెలియడంతో ఇది కాస్త వివాదంగా(Cult Title Controversy) మారింది. దీంతో సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా టైటిల్ గురించి చర్చలు మొదలయ్యాయి. అయితే తాజాగా ఈ విషయం గురించి బేబీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ట్విట్టర్ వేదికగా ఈ సినిమా టైటిల్ గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.

కొంతమంది మీడియా మిత్రులు తనని మీరు ఈ సినిమా టైటిల్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకోకుండా సినిమా టైటిల్ అనౌన్స్ చేశారా అంటూ అడిగారు. అయితే కల్ట్ బొమ్మ అనే టైటిల్ తాను గత కొన్ని నెలల క్రితమే ప్రొడ్యూసర్ కౌన్సిల్ లోరిజిస్టర్ చేయించుకున్నానని అంతేకాకుండా కల్ట్ బొమ్మ అని టైటిల్ తన బేబీ సినిమా ప్రమోషన్లలో బాగా ఫేమస్ అయిందని ఈయన తెలిపారు. తద్వారా నెక్స్ట్ సినిమా టైటిల్ కోసం నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసానని తెలిపారు. రిజిస్టర్ చేయకుండా ఏ ప్రొడ్యూసర్ కూడా అనౌన్స్ చేయరు అంటూ ఈయన తెలిపారు. అయితే ఈయన టైటిల్ కల్ట్ బొమ్మ అయినప్పటికీ విశ్వక్ సినిమాకు కల్ట్ అనే టైటిల్ పెడుతున్నటువంటి తరుణంలో వివాదం చెలరేగింది. అయితే చాలామంది వ్యవహార శైలిపై కామెంట్లు చేస్తూ వచ్చారు. మీ సినిమా టైటిల్ విశ్వక్ సినిమా టైటిల్ పూర్తిగా డిఫరెంట్ గా ఉంది. ఏదో పెద్ద ప్రొడ్యూసర్ అని ఫీల్ అవుతున్నారు. ఈ పక్క ఉన్నది విశ్వక్ జాగ్రత్త అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

Read Moreఇదీ బ్రహ్మానందం గారికి ఇచ్చే విలువ…వెంకీ రీ రిలీజ్ సందడి

ట్రెండింగ్ వార్తలు