September 23, 2022
విశ్వక్ సేన్(ViswakSen), మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ఓరి దేవుడా’. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్(VictoryVenkatesh) దేవుడు క్యారెక్టర్లో నటిస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. ఈ విషయాన్ని మేకర్స్ స్టన్నింగ్ గ్లింప్స్‌తో అధికారికంగా ధృవీకరించారు. వెంకటేష్ కూల్, స్టైలిష్ లుక్ కనపడే దేవుడు క్యారెక్టర్లో కనిపించబోతున్నారని అర్థమవుతుంది. చుట్టూ పుస్తకాలు.. సీతాకోక చిలుకలు మధ్య విశ్వక్ సేన్ కనిపించారు. ఓరి దేవుడా’ దేవుడా చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 21న విడుదల చేస్తున్నారు. పివిపి సినిమా బ్యానర్స్‌పై ప్రసాద్ వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాశారు.