December 31, 2023
Venky Movie ReRelease: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇదివరకు థియేటర్లలోకి వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాలను సొంతం చేసుకున్నటువంటి మరికొన్ని సినిమాలను ప్రస్తుతం తిరిగి విడుదల చేస్తున్నారు. ఇలా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలు తిరిగి థియేటర్లలో విడుదలవుతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే త్వరలోనే మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన వెంకీ సినిమాని విడుదల చేయడానికి మేకర్స్ అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు.
రవితేజ స్నేహ హీరో హీరోయిన్లుగా నటించినటువంటి ఈ సినిమా అప్పట్లో ఎంతగా సక్సెస్ అయిందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా తిరిగి విడుదల కానున్న నేపథ్యంలో అభిమానులు పెద్ద ఎత్తున పోస్టర్స్ వేస్తూ రచ్చ చేస్తున్నారు. అయితే ఈ పోస్టుల్లో రవితేజ స్నేహ అనుకుంటే మనం పొరపాటు పడినట్లే ఈ సినిమాలో గజాల పాత్రలో అద్భుతంగా నటించినటువంటి హాస్యబ్రహ్మ బ్రహ్మానందానికి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈ సినిమా విడుదల అవుతున్నటువంటి తరుణంలో బ్రహ్మానందం ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫ్లెక్సీలు ప్రస్తుతం వైరల్ గా మారడంతో బ్రహ్మానందం క్రేజ్ ఇంతలా ఉందా అని మరోసారి రుజువు అయ్యింది. అయితే ఈయన కమెడీయన్ గా ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రలలో నటించారు. ఇక ప్రస్తుత కాలంలో మీమర్స్ ఎక్కువ అయిన సంగతి మనకు తెలిసిందే. ఏదైనా ఒక మీమ్ క్రియేట్ చేయాలి అంటే తప్పనిసరిగా బ్రహ్మానందం ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ని ఉపయోగిస్తారన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే వెంకీ సినిమా(Venky Movie ReRelease) విడుదలవుతున్నటువంటి తరుణంలో మీమర్స్ బ్యాచ్ మొత్తం బ్రహ్మానందం ఫ్లెక్సీలను ఏర్పాటు చేయటం గమనార్హం. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్స్ మీమర్స్ పాలిట దేవుడు ఆ మాత్రం ఫ్లెక్సీ వేయాల్సిందే అంటూ ఈ ఫ్లెక్సీ పై కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ పోస్టర్ వైరల్ గా మారడంతో హీరోల కన్నా మించిన క్రేజ్ బ్రహ్మానందం గారికి ఉంది అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు
Read More: సలార్ టీం భయపడిందా?.. కలెక్షన్ల మాటే ఎత్తడం లేదే