దిల్ రాజుపై ఎస్‌కెఎన్‌ కౌంటర్లు..నెట్టింట్లో హల్ చల్!

December 23, 2023

దిల్ రాజుపై ఎస్‌కెఎన్‌ కౌంటర్లు..నెట్టింట్లో హల్ చల్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా ఎంత మంచి సక్సెస్ అందుకున్నటువంటి దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి సినిమాలను కూడా నిర్మిస్తూ నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక దిల్ రాజు వ్యవహరి శైలి ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా సంచలనంగానే మారుతూ ఉంటుంది. సంక్రాంతికి పెద్ద ఎత్తున తెలుగు తమిళ సినిమాలు విడుదలవుతున్నటువంటి తరుణంలో డిస్ట్రిబ్యూషన్ విషయంలో దిల్ రాజు తరచూ వివాదాలలో నిలుస్తూ ఉంటారు.

ఇకపోతే దిల్ రాజు గురించి తాజాగా నిర్మాత ఎస్‌కెఎన్‌ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి(Dil Raju vs SKN). బేబీ సినిమాకు నిర్మాతగా వ్యవహరించినటువంటి ఈయన అంతకుముందే ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగారు. మెగా ఫ్యామిలీకి వీరాభిమానిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఎస్కేఎన్ తాజాగా దిల్ రాజును ఉద్దేశించి పరోక్షంగా చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

కెప్టెన్ మిల్లర్ అనే సినిమాని సంక్రాంతి పండుగ సందర్భంగా వరల్డ్ వైడ్ విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ దిల్ రాజు తీసుకున్నారని తెలుస్తుంది. ఈ తరుణంలోనే మన తెలుగు సినిమాలకే సంక్రాంతికి థియేటర్లు దొరకకపోతే మరి ఈ సినిమాలను రిలీజ్ చేయడం ఏంటి అంటూ ఒక నేటిజన్ ట్విట్టర్ వేదికగా చేసినటువంటి పోస్ట్ పై ఈయన స్పందించి చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా ఎస్కేఎన్ స్పందిస్తూ.. సరి అయిన డిస్ట్రిబ్యూషన్ చూసి ఇస్తే మన సినిమా థియేటర్స్ కూడా లేపి వీళ్ళకే ఇస్తారు. మీకు తెలియనిది ఏముంది గురూజీ అంటూ ఈయన పరోక్షంగా దిల్ రాజుని ఉద్దేశించి కౌంటర్లు వేసారని స్పష్టంగా అర్థం అవుతుంది. ఈయన పేరు ప్రస్తావించకపోయిన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఎంతోమంది నేటిజన్స్ ఈయన దిల్ రాజుని ఉద్దేశించే అన్నారు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. మరి ఎస్కేఎన్ కౌంటర్ కు దిల్ రాజు రీ కౌంటర్(Dil Raju vs SKN) ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

ఇంకా చ‌ద‌వండిబికినీలో అరియాన భారీ అందాలు.. ఆఫర్ల కోసమేనంటూ దారుణంగా?

ట్రెండింగ్ వార్తలు