కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా ట్విట్టర్ రివ్యూ..!

December 29, 2023

కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా ట్విట్టర్ రివ్యూ..!

Devil Twitter Review: టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్(Kalyan Ram) హీరోగా నటించిన తాజా చిత్రం డెవిల్. ఈ సినిమా నేడు అనగా డిసెంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ సినిమాలో సంయుక్త మీనన్, మాళవిక నాయర్ లు హీరోయిన్ లుగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా రూపొందించారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ట్విట్టర్ లో(Devil Twitter Review) టాక్ ఆల్రెడీ ట్రెండ్ అవుతోంది. నెటిజెన్స్ అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ సినిమాకు సంబంధించిన రివ్యూ ని ఇస్తున్నారు. మరి డెవిల్ గురించి ట్విట్టర్‌లో ఎలాంటి చర్చ నడుస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఎక్కువ శాతం ట్విట్టర్ లో ట్వీట్ లను బట్టి చూస్తే ఈ డెవిల్ సినిమా చాలా బాగుందని మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు ఉన్నాయని, కళ్యాణ్ రామ్ వన్ మెన్ షో అని చెబుతున్నారు నెటిజన్స్. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వేరే లెవల్ అని, మాస్ ఊచ కోత బ్లాక్ బస్టర్ హిట్ బొమ్మ అని కన్ఫామ్ చేస్తున్నారు.

అలాగే సెకండాఫ్ అద్భుతంగా ఉందని, ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా నెరేట్ చేసుకుంటూ పోయాడట. సినిమాలో బీజీఎం మాత్రం అద్భుతంగా ఉందని రాసుకొచ్చారు. అలాగే కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం డెవిల్ వన్ టైం వాచబుల్ అని చెప్పేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ మీదే నడుస్తుందట. ఇక సెకండాఫ్ ట్విస్టులు, టర్న్స్, చిల్ మూమెంట్స్ ఉంటాయట. ఫస్ట్ హాఫ్ కంటే ద్వితీయార్దమే బాగుందట.

కళ్యాణ్ రామ్ వన్ మెన్ షో అని అంటున్నారు. గుడ్ థ్రిల్లర్ కమర్షియల్ మూవీ అని చెబుతున్నారు. అదేవిధంగా మరో నెటిజెన్ ఫస్ట్ హాఫ్ యావరేజ్, కాని సెకండాఫ్ అద్భుతంగా ఉందని రాసుకొచ్చారు. మొత్తానికి కళ్యాణ్ రామ్ అయితే హిట్టు కొట్టేశాడని చెబుతున్నారు. సినిమా నుంచి ఇంకా చాలా ఆశించామని, కానీ నిరాశ చెందామని మరో నెటిజన్ చెప్పుకొచ్చాడు. ఎంట్రెన్స్ గట్టిగా ఎక్స్‌పెక్ట్ చేశారట. కానీ అనుకున్న రేంజ్‌లో లేదని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ కాస్త నిదానంగా సాగుతుంది.

కొన్ని సీన్లు బోరింగ్‌గా అనిపిస్తాయి. ఇంటర్వెల్ బాగుంది. స్క్రీన్ ప్లే బాగా లేదు. మంచి కథ ఉన్నా తెరపైకి సరిగ్గా తీసుకు రాలేకపోయారు అంటూ ట్విట్టర్లో వారి అభిప్రాయాలను తెలిపారు నెటిజన్స్. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కసారి డెవిల్‌ను చూడొచ్చు. బాగానే ఉంది. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులను అస్సలు ఊహించలేము. మళ్లీ క్లైమాక్స్ రొటీన్, బాగానే సాగుతుందట.

Read More: రాశి కొట్టింది అందుకే.. ఆ రూమర్స్ పై నోరు విప్పిన శ్రీకాంత్!

ట్రెండింగ్ వార్తలు