డెవిల్ దర్శక నిర్మాతల వివాదం.. తెలివిగా తప్పించుకున్న కళ్యాణ్ రామ్

December 27, 2023

డెవిల్ దర్శక నిర్మాతల వివాదం.. తెలివిగా తప్పించుకున్న కళ్యాణ్ రామ్

నందమూరి హీరో కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) హీరోగా నటించిన తాజా చిత్రం డెవిల్(Devil). ఇందులో సంయుక్తా మీనన్ అలాగే మాళవిక నాయర్ లు హీరోయిన్ లుగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాని అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌క నిర్మాత‌గా రూపొందించారు. కాగా ఈ సినిమా డిసెంబ‌ర్ 29న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న విషయం అందరికి తెలిసిందే. విడుదల తేదీకి మరికొద్ది రోజులే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. ప్రస్తుతం మూవీ మేకర్స్ ప్రమోషన్స్ లో భాగంగా ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.

కాగా డెవిల్ సినిమా సెట్స్ పైకి వెళ్ళినప్పటి నుంచి వరుస వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పోస్టర్‌ లో ఉన్న దర్శకుడి పేరును టీమ్ తొలగించడంతో సినిమా వివాదంలో పడిన సంగతి మనందరికి తెలిసిందే. ఈ వివాదంపై ఇప్పటివరకు ఒక కొలిక్కి రాకపోగా అది మరో స్థాయికి చేరుకుంది. మొదట నవీన్ మేడారం దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. కానీ మేకింగ్ విషయంలో కొన్ని విభేదాల కారణంగా చిత్ర బృందం అతని పేరును తొలగించింది.

అంతే కాకుండా చిత్ర నిర్మాత అభిషేక్ నామా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు క్రెడిట్‌ను తీసుకున్నట్లు తెలియడంతో అందరు ఆశ్చర్యపోయారు. అయితే ఆ వివాదం విషయంలో దర్శకుడు హార్ట్ అయ్యి సోషల్ మీడియాలో ఇన్ డైరెక్ట్ గా పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. దానిపై ఎవరూ కూడా సరైన క్లారిటీ ఇవ్వలేదు. అయితే చివరికి హీరో కళ్యాణ్ రామ్ కూడా ఆ విషయంలో మౌనంగా ఉండడంతో ఎందుకు అలా ఉన్నాడు అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు.

ఇంతవరకు ఆ వివాదం పై కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) స్పందించకపోగా తాజాగా స్పందించినట్టు తెలుస్తోంది. తెలివిగా ఆ వివాదం నుంచి కళ్యాణ్ రామ్ తప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఆ వివాదం మీద నేను మాట్లాడకూడదని ఫిక్స్ అయ్యాను. అసలేం జరిగిందనేది అభిషేక్ నామా నోటి వెంట వింటేనే అందరికీ ఓ క్లారిటీ వస్తుంది. అందుకే నేను ఆ విషయంపై ఏమీ మాట్లాడొద్దని అనుకుంటున్నాను కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారట.

Read More: ఫ్యామిలీ అంటే తారక్, కళ్యాణ్ రామ్ ఇద్దరేనా?.. బాలయ్యకు దూరమైనట్టే!

ట్రెండింగ్ వార్తలు