ఇంత‌కీ డెవిల్ ఎవ‌రిది?

December 28, 2023

ఇంత‌కీ డెవిల్ ఎవ‌రిది?

వ‌రుస ప్లాఫుల త‌ర్వాత బింబిసార‌తో స‌క్సెస్ ట్రాక్ ఎక్కారు కల్యాణ్‌ రామ్‌ (Kalyan Ram). ప్ర‌స్తుతం ఆయ‌న‌ హీరోగా నిర్మాత అభిషేక్ నామా ద‌ర్శ‌క, నిర్మాత‌గా రూపొందించిన చిత్రం డెవిల్‌(Devil). సంయుక్తా మీన‌న్ హీరోయిన్‌. ఈ మూవీకి ద‌ర్శ‌కుడు నవీన్‌ మేడారం అని ప్ర‌క‌టించిన కొద్దిరోజుల్లోనే ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కి క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ రావ‌డం మొద‌లైంది. దాంతో వెంట‌నే నిర్మాత‌తో పాటు ద‌ర్శ‌కుడిగా కూడా అభిషేక్ నామా పేరు తెర‌పైకి వ‌చ్చింది. కొద్ది రోజుల చ‌ర్చ త‌ర్వాత వివాదం స‌మ‌సిపోయింది అనుకున్నారు. కానీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక న‌వీన్ మేడారం సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌తో వివాదం మ‌ళ్లీ వార్త‌ల్లోకి వ‌చ్చింది. ఈ వివాదంపై న‌వీన్‌ మేడారం, అభిషేక్ నామా వాద‌న‌లు ఇలా ఉన్నాయి.

‘డెవిల్(Devil)’ చిత్రానికి ప్రాణం పోసేందుకు దాదాపు మూడేళ్లు శ్రమించాన‌ని, స్క్రిప్ట్‌ ద‌గ్గ‌ర‌నుండి లొకేషన్స్ వ‌ర‌కూ సినిమాలోని ప్రతి అంశాన్ని త‌న‌ ఆలోచనకు తగ్గట్టుగానే తీర్చిదిద్దాన‌ని న‌వీన్ మేడారం పేర్కొన్నారు. హైదరాబాద్‌, వైజాగ్‌, కారైకుడి వంటి ప్రాంతాల్లో దాదాపు 105 రోజులు కష్టపడి.. తాను అనుకున్నవిధంగా ‘డెవిల్‌’ను తెరకెక్కించాన‌ని..ఎవరు ఎన్ని చెప్పినా.. ఇది పూర్తిగా నా చిత్రమే అని వాపోయారు.

అహంకారం, దురాశతో తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితంగానే అస‌లు వివాదం మొదలైంద‌ని.. ఇటీవల కొన్ని వెబ్‌సైట్స్‌లో వ‌చ్చిన విధంగా నేను ఏ వ్య‌క్తి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేద‌ని కానీ దర్శకుడిగా త‌న‌కు క్రెడిట్‌ ఇవ్వనందుకు ఎంతో బాధపడుతున్నాన‌ని..తెలిపారు. ‘డెవిల్‌’ తప్పకుండా బ్లాక్‌బస్టర్‌ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే డెవిల్ ద‌ర్శ‌క నిర్మాత అభిషేక్ నామా మాత్రం తాను ఓ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా తీయాలని అనుకుని, శ్రీకాంత్ విస్సాకు చెప్పగా, ఆయనే కథ తయారు చేశారన్నారు. తాను, శ్రీకాంత్ విస్సా ఈ కథను కళ్యాణ్ రామ్ దగ్గరకు తీసుకువెళ్తే, ఓకె అన్నారని, అప్పుడు తామే నవీన్ మేడారంను హీరోకి పరిచయం చేసి అవకాశం ఇచ్చామన్నారు. కానీ ఆరంభంలోనే ఓ పెద్ద ఫైట్ సీన్ తీయడంలో నవీన్ త‌డ‌బ‌డ్డాడని, అప్పుడే మార్చేద్దాం అనుకుంటే, ఒక్క చాన్స్ ఇవ్వమని బతిమాలారని చెప్పుకొచ్చారు. ఆ త‌ర్వాత కూడా న‌వీన్ మేడారం మేకింగ్ న‌చ్చ‌క‌పోవ‌డంతో త‌న‌ని తప్పించక తప్పలేదని వివరించారు. అప్పట్లోనే లీగల్ నోటీస్ ఇచ్చి.. పద్దతి ప్రకారం సెటిల్ చేయడం జరగిందన్నారు.

మ‌రి నిజంగానే డెబ్యూ డైరెక్ట‌ర్ న‌వీన్ మేడారం 105 రోజులు షూట్ చేశాడా..లేదా అభిషేక్ నామానే సినిమాని పూర్తిగా డైరెక్ట్ చేశాడా? అనేది తెలియాలంటే రేపు రిలీజ‌య్యే డెవిల్ చూస్తే ఆడియ‌న్స్‌కి ఓ ఐడియా వ‌స్తుంది.

Read More: వివాహా బంధం సక్సెస్ అవ్వాలంటే.. అది ఉండాల్సిందేనంటోన్న ఉపాసన, రామ్ చరణ్‌

ట్రెండింగ్ వార్తలు