ఇదేం టైటిల్ బాబీ… బాలయ్య సినిమా కోసం ఇంత చెత్త టైటిలా.. బ్రెయిన్ ఏమైనా దొబ్బిందా?

April 3, 2024

ఇదేం టైటిల్ బాబీ… బాలయ్య సినిమా కోసం ఇంత చెత్త టైటిలా.. బ్రెయిన్ ఏమైనా దొబ్బిందా?

ఇటీవల కాలంలో ఒక సినిమాని ప్రమోట్ చేసుకోవాలి అంటే సినీ సెలబ్రిటీలు చాలా విభిన్న రకాలుగా ఆలోచిస్తూ ఆ సినిమాలను ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలు ఇలా విభిన్న రీతిలో సినిమాలను ప్రమోట్ చేస్తూ వివాదాలలో చిక్కుకున్న సంగతి తెలిసిందే అయితే చాలామంది తమ సినిమా టైటిల్ ఆధారంగానే సినిమాని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతూ ఉంటారు కొన్ని సినిమా టైటిల్స్ చూస్తే సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోతూ ఉంటాయి.

ఇక సినిమా టైటిల్స్ విషయానికి వస్తే బాలయ్య సినిమాలకు చాలా ఆలోచించి చాలా విభిన్నంగా ఉండే టైటిల్స్ ఎంపిక చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా బాలకృష్ణ సినిమా అంటేనే ఆయన టైటిల్ సెంటిమెంట్ కచ్చితంగా ఉండేలా దర్శక నిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. బాలయ్య సినిమా టైటిల్స్ లో సింహ అనే పదం కనుక ఉంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే సంగతి మనకు తెలిసిందే.

ఇటీవల భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి బాలయ్య మంచి హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఈయన డైరెక్టర్ బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా భారీ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ చూస్తేనే అర్థమవుతుంది.

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించినటువంటి టైటిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా పూర్తి అయిందని సమాచారం. ఈ సినిమా కోసం బాబి వీరమాస్ అనే టైటిల్ ఖరారు చేశారని తెలుస్తుంది. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఒక్కసారిగా డైరెక్టర్ బాబి పై మండిపడుతున్నారు. అసలు వీరమాస్ టైటిల్ ఏందిరా సామి.. బాబి అసలు బ్రెయిన్ ఉండే ఈ టైటిల్ సెలెక్ట్ చేసావా అంటూ బాలయ్య అభిమానులు డైరెక్టర్ బాబి పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

Read More: ప్రభాస్ కి ఆ సబ్జెక్ట్ అంటే అంత భయమా.. ఎప్పుడు ఫెయిల్ అయ్యేవారు?

ట్రెండింగ్ వార్తలు