బాలయ్య కోసం హిట్ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న బాబి.. వర్క్ అవుట్ అయ్యేనా?

March 21, 2024

బాలయ్య కోసం హిట్ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న బాబి.. వర్క్ అవుట్ అయ్యేనా?

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో బాలయ్య తన వయసుకు తగ్గ సినిమాలను ఎంపిక చేసుకొని బాక్సాఫీస్ బరిలో దిగుతూ సంచలనం అయినటువంటి విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఇక ఇటీవల బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని బాబి డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే. బాబి చివరిగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా ద్వారా హిట్ కొట్టారు. ప్రస్తుతం బాలకృష్ణను డైరెక్ట్ చేస్తున్న బాబి సరికొత్త కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది.

ఇక ఇటీవల శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి చిన్న గ్లింప్ వీడియో సంచలనంగా మారింది. ఈ వీడియో లోని డైలాగ్స్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చాయని చెప్పాలి. ఇక ఈ వీడియో విడుదల చేసిన అనంతరం సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేయబోతున్నారని సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం బాబి బాలయ్య హిట్ సెంటిమెంటును రిపీట్ చేయబోతున్నారని తెలుస్తోంది.

బాలకృష్ణ నటించినటువంటి సూపర్ హిట్ సినిమాలలో ఆయన ద్విపాత్రాభినయంలో నటించారు. చెన్నకేశవరెడ్డి నుంచి మొదలుకొని సింహ లెజెండ్ అఖండ వంటి చిత్రాలన్నింటిలో కూడా బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాలో కూడా బాలయ్య ద్విపాత్రాభినయంలో నటించబోతున్నారని సమాచారం. మరి ఈ సినిమా విషయంలో బాలయ్య హిట్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Read More: జపాన్ లో భూకంపం.. పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన రాజమౌళి దంపతులు?

ట్రెండింగ్ వార్తలు