ఫేస్ బ్లైండ్ నెస్ తో బాధపడుతున్న సుహాస్.. ప్రసన్న వదనం టీజర్ అదిరిందిగా!

March 7, 2024

ఫేస్ బ్లైండ్ నెస్ తో బాధపడుతున్న సుహాస్.. ప్రసన్న వదనం టీజర్ అదిరిందిగా!

ఈ మధ్యనే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తో హిట్ అందుకొని మంచి ఫామ్ లో ఉన్నాడు సుహాస్. షార్ట్ ఫిలిమ్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగి ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ తో దూసుకుపోతున్న సుహాస్ ఇప్పుడు ప్రసన్న వదనం సినిమాతో మళ్లీ మన ముందుకి రాబోతున్నాడు. సుహాస్ హీరోగా పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్ లుగా వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

ఈ సినిమా తో అర్జున్ అనే కొత్త వ్యక్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్ పై మణికంఠ, ప్రసాద్ రెడ్డి నిర్మాతలుగా ప్రసన్నదనం సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. ఈ సినిమాలో సుహాస్ కి ఎవరి ఫేసు సరిగ్గా కనబడని, గుర్తుపట్టలేని ఫేస్ బ్లైండ్ నెస్ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు చూపించారు.

అలాంటి వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది, ఆ సమస్య వల్ల అతను ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి అనేది ఈ సినిమా.ఈ టీజర్ చూస్తుంటే క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇక సుహాస్ కెరియర్ విషయానికి వస్తే కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమాలతో హీరోగా సుహాస్ మంచి పేరు సంపాదించుకున్నాడు. కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తాడని మార్క్ క్రియేట్ చేసుకున్నాడు.

ఇప్పుడు ప్రసన్న వదనం లో ఫేస్ బ్లైండ్ నెస్ తో బాధపడే వ్యక్తిగా మన ముందుకి వస్తున్నాడు సుహాస్. తర్వాత కలర్ ఫొటో ఫేమ్ సందీప్ రాజ్ తో ఒక సినిమా చేస్తున్నాడట. ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అంటున్నాడు సుహాస్, ఆ తర్వాత కేబుల్ రెడ్డి అనే మరొక మూవీ కూడా చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో సలార్ రైటర్ తో ఒక మూవీ జరుగుతోందని తన అప్ కమింగ్ మూవీస్ గురించి చెప్పుకొచ్చాడు సుహాస్.

Read More: తండ్రి అయిన హీరో శర్వానంద్.. కూతురు పేరు ఏంటో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు