ఫ్యామిలీ స్టార్ టీజర్ వచ్చేసింది.. విజయ్ దేవరకొండ కి లీటర్ పెట్రోల్ కావాలంట!

March 6, 2024

ఫ్యామిలీ స్టార్ టీజర్ వచ్చేసింది.. విజయ్ దేవరకొండ కి లీటర్ పెట్రోల్ కావాలంట!

గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మళ్లీ ఆ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్.దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి టైటిల్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు తాజాగా ఈ మూవీ టీజర్ ని కూడా రిలీజ్ చేశారు.

ఒక చిన్న టీజర్ తో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో కనిపించే చాలా సీన్స్ ని చూపించేశాడు డైరెక్టర్. గోపి సుందర్ కంపోజ్ చేసిన దేఖో రే దేఖో సాంగ్ తో హీరో క్యారెక్టర్రైజేషన్ ని వర్ణిస్తూ సాగిన ఈ టీజర్ ఆకట్టుకుంది. దేవుడి పూజతో సహా ఇంటి పనులన్నీ చేసుకుంటూ తన కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు హీరో.

వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే మడత పెట్టి కొడతాడు. ఫ్యామిలీ అంటే వీక్నెస్ ఉన్న కలియుగ రాముడిలా విజయ్ దేవరకొండను టీజర్ లో చూపించారు. అతను వేస్తే బడ్జెట్ షాక్, ప్లాన్ గీస్తే ప్రాజెక్టు షేక్ అవుతుంది. టీజర్ చివరలో హీరోయిన్ మృణాల్ నేను కాలేజీకి వెళ్ళాలి కొంచెం దించేస్తారా అని అడిగితే లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా అంటాడు హీరో. ఇలా హీరో క్యారెక్టర్ లో ఉన్న హోమ్లీ మేన్లీ లవ్లీ తో టీజర్ ఇంప్రెస్ చేసింది.

ఒక మిడిల్ క్లాస్ కుర్రాడిలో కనిపించే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తో పాటు మాస్ హీరోయిజం కూడా ఈ సినిమాలో ఉండబోతుంది అని తెలుస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సమ్మర్ కి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ అయిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఉండబోతున్నట్లు టీజర్ క్లారిటీ ఇచ్చింది.

Read More: రాజమౌళి సినిమాపై మహేష్ అప్డేట్.. నా కెరియర్ ని మార్చాయంటూ కామెంట్స్?

ట్రెండింగ్ వార్తలు