May 1, 2024
టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు విజయ్ దేవరకొండ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈయన ఇటీవల ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు.
ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా తర్వాత ఈయన తిరిగి రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్లో మరో సినిమా చేయబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే టాక్సీవాలా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తిరిగి రెండోసారి వీరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుందని తెలుస్తోంది.
ఇక వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నారనే చెప్పాలి. ఇక ఈనెల తొమ్మిదవ తేదీ విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో అదే రోజున ఈ సినిమాకు సంబంధించిన విషయాన్ని అధికారకంగా తెలియజేయబోతున్నారని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి నుంచి షూటింగ్ పనులను ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అయితే ఈయన గౌతమ్ తిన్ననూరి సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల ఈయన నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా పట్ల ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి కానీ అనుకున్న స్థాయిలో మాత్రం ఈ సినిమా సక్సెస్ అందుకోలేకపోయిందని తెలుస్తుంది. అయితే ఈయనకు ఇటీవల కాలంలో ఒక్కసారైనా హిట్టు కూడా పడకపోవడంతో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు.
Read More: ఐపీఎల్ 2024 లో ప్రభాస్ కల్కి యాడ్ ప్రమోషన్.. వేరే లెవెల్ ప్రమోషన్!