ఆ ఒక్క విషయంలో దిల్ రాజుని మెచ్చుకోక తప్పదు.. అదేంటో తెలుసా?

April 13, 2024

ఆ ఒక్క విషయంలో దిల్ రాజుని మెచ్చుకోక తప్పదు.. అదేంటో తెలుసా?

పరుశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ కలిసి నటించిన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు ప్రేక్షకుల అంచనాలను ఒక్కసారిగా తిప్పి కొట్టేసింది. ఈ సినిమాపై అటు మూవీ మేకర్స్ అలాగే ఇటు అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకోగా ఏ ఒక్క అంచనాలను అందుకోలేకపోయింది ఫ్యామిలీ స్టార్. ఈ సినిమాతో తప్పకుండా విజయ్ దేవరకొండ క్రేజ్ మరింత పెరుగుతుంది అని అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూశారు..

కానీ ఆశకపోతే నిరాశ ఎదురయ్యింది. ఇకపోతే ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు నిర్మించిన విషయం తెలిసిందే.. ఇంతకుముందు చాలా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు ఈ సినిమా పట్ల మరింత ఎక్కువ ఆసక్తిని కనబరిచారు. స్వయంగా తానే వెళ్లి థియేటర్ల వద్ద రివ్యూలు అడగడం లాంటివి కూడా చేశారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. ఇన్ని చేసిన ఒక్క విషయంలో మాత్రం దిల్ రాజుని మెచ్చుకోవచ్చు అంటున్నారు నెటిజన్స్.. ఇంతకీ ఆ ఒక్క విషయం ఏమిటి అన్న విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో కలెక్షన్లు రాకపోయినప్పటికీ కలెక్షన్లు గొప్పగా చెప్పుకునే హైప్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు కొందరు మూవీ మేకర్స్.

రెండో రోజు నుంచే తమ సినిమాకు ఇన్నేసి కోట్లు వచ్చాయని పోస్టర్లలో పెద్ద పెద్ద నెంబర్లు వేసి మారి పబ్లిసిటీ చేయడం గుంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాం. ఇమేజ్ ఉన్న హీరోల అసలు ఫిగర్లకు ఒక పాతిక శాతం దాకా ఫేక్ కలిపేసి తమది బ్లాక్ బస్టరని చాటింపు వేసుకునే ప్రొడ్యూసర్లకు కొదవ లేదు. ఇలా చేయడం కొంత సానుకూల ఫలితాలు ఇచ్చిన సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే వీటి జోలికి మాత్రం దిల్ వెళ్ళలేదు. ఈ విషయంలో మాత్రం ఆయనని ఒప్పుకోవచ్చు. ఏప్రిల్ 5 రిలీజ్ రోజు నుంచి మొదలు పెడితే ఏ దశలోనూ వసూళ్లను హైలైట్ చేస్తూ పోస్టర్ కానీ ప్రమోషన్ కానీ చేయకపోవడం గమనార్హం. దీని కన్నా దారుణంగా తిరస్కారానికి గురైన సినిమాలు ఎన్నో కనీసం వారం వరకు కలెక్షన్ల హడావిడితో ఎంతో కొంత జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసి కలెక్షన్లు పెంచుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాయి. దిల్ రాజు మాత్రం పబ్లిక్ రియాక్షన్లు, థియేటర్ నుంచి బయటికొచ్చిన జనాల స్పందనలు మాత్రమే వీడియో రూపంలో ప్రమోట్ చేశారు కానీ, ఇన్నేసి కోట్లు వచ్చాయి అని అసత్య ప్రచారం చేయలేదు. ఇది ఒకరకంగా మంచిదే అని చెప్పాలి. సుమారు నలభై అయిదు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఫ్యామిలీ స్టార్ ఇంకా సగం దూరం పైనే ప్రయాణం చేయాల్సి ఉంది.

https://telugu.chitraseema.org/manchu-manoj-and-mounika-reddy-blessed-with-a-baby-girl/

ట్రెండింగ్ వార్తలు