దుబాయ్ వెకేషన్ లో రష్మిక విజయ్.. నేటిజన్ పోస్టుతో దొరికిపోయిన జంట?

April 8, 2024

దుబాయ్ వెకేషన్ లో రష్మిక విజయ్.. నేటిజన్ పోస్టుతో దొరికిపోయిన జంట?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి రష్మిక నటుడు విజయ్ దేవరకొండతో రిలేషన్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరూ సీక్రెట్ గా తమ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉన్నప్పటికీ ఏదో ఒక సందర్భంలో వీరి రిలేషన్ గురించి బయటపడుతూ వస్తోంది. అయితే తాజాగా ఏప్రిల్ 5వ తేదీ రష్మిక పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు ఈ పుట్టిన రోజు వేడుకలలో భాగంగా ఈమె విదేశాలకు వెళ్లిపోయారు.

అదే రోజే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నటువంటి ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా విడుదలకు ముందు వరకు విజయ్ దేవరకొండ పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది కానీ ఎక్కడ కూడా విజయ్ దేవరకొండ ఈ సినిమా గురించి స్పందించిన దాఖలాలు కనిపించలేదు.

ఈ క్రమంలోనే ఫ్యామిలీ స్టార్ ఇలాంటి కష్టాలలో ఉంటే విజయ్ దేవరకొండ ఎక్కడ అంటూ అందరూ కూడా సందేహాలు వ్యక్తం చేశారు. అయితే ఈయన రష్మిక తో కలిసి తన బర్త్ డే సందర్భంగా ఫారెన్ వెళ్లారంటూ కొందరు కామెంట్లు చేయగా ఇలా ఇద్దరు ఫారెన్ వెళితే ఎయిర్ పోర్ట్ లో అయినా వీరు మీడియా కంటపడేవారు కదా అంటూ సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఒక నేటిజన్ చేస్తున్నటువంటి పోస్టుతో వీరిద్దరూ అడ్డంగా దొరికిపోయారు ఇద్దరు కలిసి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం కోసం దుబాయ్ వెళ్లారని తెలుస్తోంది. దుబాయ్ లోని జాయేద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో వర్క్ చేసే ఒక ఇండియన్.. తన ఇన్‌స్టాగ్రామ్ లో విజయ్ తో దిగిన ఫోటోని షేర్ చేసారు. ఇక ఆ ఫోటో కింద క్రెడిట్స్ ఇస్తూ.. ఫోటో తీసింది శ్రీవల్లి అని రాసుకొచ్చాడు. శ్రీవల్లి అంటే పుష్ప సినిమాలో రష్మిక పాత్ర పేరు. సో ఈ ఫోటో తీసింది రష్మికే అని తెలియడంతో వీరిద్దరూ కలిసే వెకేషన్ వెళ్లారని తెలుస్తుంది. ఇలా పలు సందర్భాలలో వీరిద్దరూ బయటపడుతూ ఉన్నప్పటికీ వీరి రిలేషన్ మాత్రం బయటకు చెప్పడం లేదు.

Read More: గంగమ్మ జాతరలో శివాలేత్తిన పుష్పరాజ్..గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీజర్!

ట్రెండింగ్ వార్తలు