సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసిన నాని.. గుండె బరువెక్కిందంటూ?

April 22, 2024

సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసిన నాని.. గుండె బరువెక్కిందంటూ?

టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని గురించి మనందరికీ తెలిసిందే. నాని ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు నాని.

ఇది ఇలా ఉంటే తాజాగా హీరో నాని సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఇంతకీ ఆ పోస్టులో నాని ఏం రాసుకు వచ్చారు అన్న విషయాన్ని వస్తే.. నాని కెరీర్‌ లోని సూపర్‌ హిట్‌ చిత్రాల్లో జెర్సీ ఒకటి. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన క్రికెటర్‌గా నటించారు. శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్ గా నటించింది. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలై శుక్రవారం తో ఐదేళ్లు అయ్యింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో జెర్సీ స్పెషల్‌ షో వేశారు. దీనికి, నాని అంజనా దంపతులు హాజరయ్యారు. అభిమానులు చూపిస్తోన్న ఆదరణ పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

ఈరోజు నాకెంతో భావోద్వేగంగా ఉంది. అభిమానులు ఆదరణ చూస్తుంటే.. మళ్లీ తన ప్రయాణాన్ని ఆస్వాదించడం కోసం అర్జున్‌ తిరిగి భూమ్మీదకు వచ్చినట్టుంది. గుండె బరువెక్కింది. అభిమానుల ప్రేమాభిమానాలతో మనసు నిండిపోయింది అని ఎమోషనల్‌ పోస్ట్ పెట్టారు. అంజనా సైతం ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. తొలిసారి థియేటర్‌లో ఆ సినిమా చూసిన రోజులు నాకింకా గుర్తున్నాయి. ఎన్నిసార్లు చూసినా ఆ సీన్స్‌ నన్ను భావోద్వేగానికి గురిచేస్తాయి. మా అబ్బాయి అర్జున్‌ ఇప్పుడిప్పుడే జెర్సీ థీమ్‌ సాంగ్‌ పియానోపై ప్లే చేయడం నేర్చుకుంటున్నాడు అని రాసుకొచ్చారు.

Read More: ఇండియాలో టాప్ 10 హీరోయిన్లు వీళ్లే.. టాప్ వన్‌లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్?

ట్రెండింగ్ వార్తలు