నాని నటనకు ఫ్లాట్ అయిపోయి ఫాన్ అయిపోయిన బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్.. అందుకే అతనితో భేటీ!

March 27, 2024

నాని నటనకు ఫ్లాట్ అయిపోయి ఫాన్ అయిపోయిన బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్.. అందుకే అతనితో భేటీ!

చూడటానికి పక్కింటి అబ్బాయిలా కనిపించే నాని తనదైన నటనతో నాచురల్ స్టార్ అనిపించుకున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సినిమా పరిశ్రమలో అందవచ్చిన అవకాశాలను ఒడిసి పట్టుకొని స్టార్ హీరోగా ఎదిగిన ఈ తరం నటులలో ఆయన ముందుంటారు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే ఈ నటుడికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా అభిమానులు ఉండటం విశేషం.

అయితే ఇప్పుడు ఆ లిస్టులోకి బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ కూడా చేరారు. ఇంతకీ విషయం ఏమిటంటే..తెలుగు రాష్ట్రాలకు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గా పని చేస్తున్న గారెత్ విన్ ఓవెన్ టాలీవుడ్ స్టార్ హీరో నానిని మర్యాదపూర్వకంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ కలుసుకున్నారు. నాని గారెత్ ను పుష్పగుచ్చం తో పాటు శాలువా కప్పి ఆహ్వానించాడు. అనంతరం కొద్దిసేపు వారు ముచ్చటించారు.

ఈ విషయాన్ని గారెత్ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు. నానిని కలవడం తనకి ఎంతో ఆనందం కలిగించిందన్నారు. నాని సినీ, వ్యక్తిగత జీవితం గురించి అడిగి తెలుసుకున్నానన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ తో బ్రిటన్ సంబంధాలు ఏ విధంగా బలోపేతం చేయవచ్చు అనే అంశంపై ఇద్దరూ చర్చించుకున్నాము, తాను నటించిన రెండు సినిమాల చూడమని నాచురల్ స్టార్ నాని నాకు సజెస్ట్ చేశారని అలాగే మీరు కూడా నేను నాచురల్ స్టార్ నాని సినిమాలు ఏవి చూడాలో చెప్పండి అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు ఓవెన్.

ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కాగా సరిపోదా శనివారం సినిమాని తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆగస్టు 29న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మూవీ మేకర్స్. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వాళ్ల కాంబినేషన్లో రెండో సినిమా కావటం విశేషం. ఈ సినిమాలో నాని మాస్ లుక్ తో కనిపిస్తారు. సినిమాలో ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ కాగా ఎస్ జె సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే నాని తరువాత సినిమా బలగం సినిమా దర్శకుడు వేణు దర్శకత్వంలో ఉండబోతుందని సమాచారం.

Read More: మెగా కోడలు లావణ్య కు అలాంటి జబ్బు ఉందా.. అందుకే పెళ్లిలో ఆ పని చేయలేదా?

ట్రెండింగ్ వార్తలు