ఎవరితో చేసుకుంటారో చేసుకోండి.. జెర్సీ 2 పై నాని షాకింగ్ కామెంట్స్!

April 23, 2024

ఎవరితో చేసుకుంటారో చేసుకోండి.. జెర్సీ 2 పై నాని షాకింగ్ కామెంట్స్!

నాచురల్ స్టార్ నాని ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు ఈయన సినీ కెరియర్లో బెస్ట్ సినిమాలలో చెప్పుకోదగ్గ సినిమా జెర్సీ ఒకటి చెప్పాలి. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కమర్షియల్ గా ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఈ సినిమా కథ మాత్రం అందరిని ఎమోషనల్ గా ఆకట్టుకుందని చెప్పాలి.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా విడుదల అయ్యి ఐదు సంవత్సరాలు అయినటువంటి తరుణంలో మరోసారి ఈ సినిమాని తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమాకి ఇప్పటికీ కూడా అదే స్థాయిలో ఆదరణ రావడంతో నాని సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా నాని అల్లరి నరేష్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా నానికి అభిమానుల నుంచి జెర్సీ సీక్వెల్ సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

జెర్సీ సీక్వెల్ సినిమా చేయాలి అంటూ కొందరు అడగగా ఎప్పుడు సీక్వెల్ రాబోతుంది అంటూ మరికొందరు ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు నాని సమాధానం చెబుతూ… నేను లేను కదా.. జెర్సీ 2 ఎవరితో చేసుకుంటారో చేసుకోండి అని చెప్పారు. జెర్సీ సినిమా క్లైమాక్స్ లో నాని పాత్ర చనిపోతుంది. దీంతో నానితో సీక్వెల్ తీయలేరు కాబట్టి నాని ఇలా ఎవరితో చేసుకుంటారో చేసుకోండి అని చెప్పడం గమనార్హం.

ఒకవేళ జెర్సీ 2 సీక్వెల్ కనుక చేయాలి అనుకుంటే పెద్దయ్యాక నాని కొడుకు పాత్రలో నటించిన హరీష్ కళ్యాణ్ తో తీయాలి. మరి జెర్సీ 2 వస్తుందా లేదా అనే విషయం డైరెక్టర్ కె తెలియాల్సి ఉంది. ఇక నాని ప్రస్తుతం సరిపోలేదా శనివారం సినిమాతో పాటు దసరా సీక్వెల్ సినిమాకి కూడా కమిట్ అయిన సంగతి మనకు తెలిసిందే.

Read More: యానీ మాస్టర్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. డాన్స్ చేస్తూ అలా?

ట్రెండింగ్ వార్తలు