యాంకర్ రష్మీ ఇజ్జత్ తీసిన హైపర్ ఆది.. ఇన్నేళ్లైనా అంతేనా?

January 2, 2024

యాంకర్ రష్మీ ఇజ్జత్ తీసిన హైపర్ ఆది.. ఇన్నేళ్లైనా అంతేనా?

తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది(Hyper Aadi) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ కమెడియన్ గా ప్రత్యేకమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు హైపర్ ఆది. జబర్దస్త్ షోలో తనదైన శైలిలో పంచులు వేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు. కేవలం జబర్దస్త్ షోలో మాత్రమే కాకుండా ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ, పండుగ ఈవెంట్ లలో సందడి చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు హైపర్ ఆది. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై స్టార్‌ కమెడియన్‌ గా రాణిస్తున్నాడు.

నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగానూ మారాడు. పవన్‌ కళ్యాణ్‌ జనసేనకి ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఒకవైపు బుల్లితెరపై తన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూనే సినిమాలలో హీరోల పక్కన సైడ్ క్యారెక్టర్ లలో నటిస్తూ ఉంటాడు. ఇకపోతే హైపర్ ఆది పంచుల విషయం గురించి ప్రత్యేకంగా పరిచయం లేదు. ఏ సోలో అయినా కూడా జడ్జిని మొదలుకొని యాంకర్ వరకు ప్రతి ఒక్కరిపై పంచుల వర్షం కురిపిస్తూ ఉంటాడు.

అప్పుడప్పుడు డబుల్ మీనింగ్ డైలాగులు కూడా వేస్తూ ఉంటాడు హైపర్ ఆది. ఇది ఇలా ఉంటే తాజాగా హైపర్ ఆది యాంకర్ రష్మీ పరువు తీసేసాడు. అసలేం జరిగిందంటే.. తాజాగా ఢీ సెలబ్రిటీ లేటెస్ట్ ప్రోమో విడుదల చేయగా అధి కాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ ప్రోమో లో యాంకర్ సుమ తన కొడుకు రోషన్ తో కలిసి ఢీ షో కి హాజరైంది.

ఇక అందులో భాగంగానే హీరోయిన్ ప్రణీతని న్యూ ఇయర్ రిసల్యూషన్ ఏంటి అనే సుమ ప్రశ్నించగా వెంటనే ప్రణీత స్పందిస్తూ తెలుగులో చక్కగా మాట్లాడుతూ జడ్జిమెంట్ ఇవ్వాలని ఉంది అని సమాధానం ఇచ్చింది. వెంటనే హైపర్ ఆది(Hyper Aadi) మాకు తెలుగులో యాంకర్ రష్మీ అనే ఒక ఆమె ఉంది ఆమె స్పీచ్ వినండి మీకు ఆ కోరిక అస్సలు పుట్టదు అంటూ ఢీ లో రష్మీ పరువు తీసేసాడు. ఇన్ డైరెక్ట్ గా రష్మీకి(Rashmi Gautam) తెలుగు మాట్లాడడం రాదు అంటూ పంచులు వేశాడు హైపర్ ఆది.

Read More: చేతిలో మందు గ్లాసుతో న్యూ ఇయర్‌కు వెల్కమ్.. సుప్రిత ఫోటో వైరల్

ట్రెండింగ్ వార్తలు